పురస్త్రీలు
జయతరాజు ముమ్మయ – విష్ణుకథానిధానము
సీ. |
వలపుల బొమలమై నిలుకడఁ గన్నులఁ
బుష్పచాపధ్వజస్ఫూర్తి గలిగి
కాంతి[1]గంధంబులఁ గరములఁ దనువల్లిఁ
గనకపంచమదామగరిమఁ దాల్చి
కురులను బొడ్డునఁ బిఱుఁదునఁ [2]గుచమున
ఘనసరసీచక్రగతి వహించి
నేర్పున నగవున నిగ్గున [3]మోమున
శారదామృతభానుసమితి నొంది
|
|
తే. |
కౌను నఖముల సొబగును గల్గి చూపు
హరిమణిశ్రీ సమానత నతిశయిల్లి
రూపశుభలక్షణముల [4]నేపు మిగిలి
వెలఁదు లమరుదు రవ్వీట వేడ్కతోడ.
| 225
|
సీ. |
చూడ్కి [5]మోహననాభిసువిహారయోగ్యత
వలరాజు బావిజావళము సేసి
యెలయింత బొమలమై మెలఁకువమాటల
మరువింటిరసము [6]లీరసము సేసి
కళలఁ దనుప్రభగతి నటనంబున
శారదమెఱుఁగుగజంబు గెలిచి
యెలమినవ్వునఁ గుచముల నిటలంబున
మొలకవెన్నెలమొగ ముంపు దింపి
|
|
తే. |
పలుక నేర్చిన రతనంపుఁబ్రతిమ లనఁగఁ
దిరుగ నేర్చిన వెన్నెలతీఁగె లనఁగ
పొంద నేర్చిన పుత్తడిబొమ్మ లనఁగ
నొప్పుదురు కామినీమణు లప్పురమునందు.
| 226
|
సీ. |
మృగరాజమధ్యలై మిక్కిలి మెఱసియు
వక్షోజకరికుంభరక్ష సేసి
|
|
- ↑ క.బంధంబు
- ↑ క.కుచయుగమున
- ↑ ట.మొగమున
- ↑ క.నేర్పు
- ↑ ట.మోమున
- ↑ ట.లేఁబరము