పుట:ప్రబంధరత్నాకరము.pdf/58

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పేరఁ బేర్కొను పౌరులఁ [1]గేరి కేరి
నవ్వుదురు పుష్పలావికానళినముఖులు.

212

[2]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-19]

సీ.

కరముల [3]కందించు విరులబంతుల కంటె
              వెడదోఁచు చన్నులు వేడ్కఁ బెనుప
మవ్వంబు గొన నెత్తు పువ్వు[4]టెత్తుల కంటెఁ
              గరమూలరుచి చూడ్కి గమిచి తిగువఁ
గోరిన నొసఁగెడు కొసరుపువ్వుల కంటె
              మొలకనవ్వులు డెందములు గరంప
నిరిడారు నలరుల నెత్తావిగమి కంటె
              సుముఖసౌరభములు చొక్కు [5]నినుప


ఆ.

జట్టికాండ్రఁ దమదు సరససుందరవిలా
సములచేతఁ దార జట్టిగొనుచుఁ
బురము వీథులకును భూషణప్రాయమై
క్రాలు పుష్పలావికాజనంబు.

213

కవిలోకబ్రహ్మ - అరుణాచలపురాణము

సీ.

భ్రమరికావలికప్పుఁ బ్రసవగుచ్ఛభ్రమద్
              భ్రమరకావలి కప్పు బాంధవింపఁ
గరముల కెంపును గమనీయహల్లకో
              త్కరముల కెంపు సఖ్యంబు సేయ
ముఖసౌరభములు నమోఘాతిముక్తక
              ముఖసౌరభంబులు మొనసి బెరయ
హాసవిస్ఫూర్తులు నతులవర్ణప్రతి
              హాసవిస్ఫూర్తులు నణఁగి పెనఁగ


తే.

[6]సరసములన్ గుందముల విలాసములు సూపి
వరుసఁ బువ్వులు జట్టికో [7]వచ్చినట్టి
జనుల మనసులు మును [8]వారు జట్టిఁగొండ్రు
పుష్పలావీవధూటు లప్పురమునందు.

214
  1. క.గేలికే
  2. సుంకసాల
  3. క.ఖండించు
  4. క.బంతుల
  5. బెనుప
  6. ట.సారములగు తమ్ముల
  7. ట.గా
  8. ట.తారు