పుట:ప్రబంధరత్నాకరము.pdf/57

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గొనుఁడు పరార్థవస్తువులు గోరిన వానిన [1]యిత్తు మన్తెఱం
గునఁ బచరింతు రంగడులఁ గోమటు లప్పురి [2]సిద్ధరత్నముల్.

208

మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత [1-46]

ఉ.

వారణవారికర్ణపుటవాతకిశోరసారసారక
ర్పూరపరాగముల్ నెఱయుఁబో పురవీథులఁ దార తార ము
క్తారమణీయమంటపవితానవినిర్గతకాంతివాహినీ
పూరములోపలం గలయఁబొల్చు వినిర్మలవాలుకాకృతిన్.

209

[3]సుంకసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-19]

ఆ.

ఉచితసమయ మగుటయును రత్నగర్భ ప్ర
సూతి నొందియున్న చొప్పు మెఱయు
వివిధమణిసమృద్ధి వీక్షింపఁగా నొప్పు
నప్పురంబులోన నాపణములు.

210

చిమ్మపూడమరేశ్వరుని విక్రమసేనము

ఆ.

నీర నగ్నియునికి యారయ విస్మయం
బనుచు బాడబాగ్ని కడరి యప్పు
రంబుఁ జొచ్చెనొక్కొ రత్నాకరము మణు
లనఁగఁ [4]బెలుచ నమరు నాపణములు.

211

పుష్పలావికలు

తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము

సీ.

వలమానచంపకోత్పలమాలికాదిసం
              గ్రథనచాతురి నెఱ[5]కవులఁ బోలి
దళము [6]గెలిచిన సూత్రమున నూల్కొల్పు నే
              ర్పున యోధవీరుల పొలుపుఁ దెలిపి
ఖండితత్వమున రాగము గల పల్లవా
              వళిఁ [7]గోయుటల వేశ్య [8]వలపు నెఱపి
పలుతావు లరసి యెత్తులు పచరించు పెం
              పున జూదరుల ఠేవ వొడమఁ జేసి


తే.

తమ నిజాంగమరీచులు తత్తదన్య
పుష్పముల సావి నిక్కంపుఁ బువ్వు లమరు

  1. క.వచ్చి యెత్తెరం
  2. క.నిద్ధ
  3. సంకుసాల
  4. ట.జెలువ
  5. క.కౌల
  6. క.నే
  7. క.దో
  8. క.లఠివి