[1]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-11]
ఉ. |
లేకి నిధివ్రజంబు లవలేశము కాంచనభూధరంబు ర
త్నాకరరత్నరాశు లడిగంట్లు మరున్మణికామధుక్సురా
నోకహముల్ క్రయోచితవినూతనవస్తువు లిట్టి వట్టి వన్
వాకుల కందరాని పురవైశ్యుల సంపద లెన్ని చూపుచోన్.
| 197
|
మాదయగారి మల్లయ్య – రాజశేఖరచరిత [1-50]
ఉ. |
కాఁకరపండు వంటి జిగి గల్గిన మేలిపసిండి ధాత్రికిన్
వ్రేఁకముఁ ద్రవ్వి పోసినను వేయి యుగంబులు చెల్లు ధాన్యముల్
పోఁకకుఁ బుట్టె డమ్మినను బో నొకకల్పము పట్టు మాడ్కి పే
రేఁకటి దీఱ వైశ్యపతు లిండ్ల గనుంగొన నొప్పు నప్పురిన్.
| 198
|
తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము
చ. |
యుగములు వేయి వోవు నొక[2]యుద్ధరవుల్ గణుతించు[3]నంతకే
యుగములు లక్ష చెల్లుఁ [4]బొదినున్న ధనంబు మితింప నమ్మహా
యుగశతకోటు లేఁగు నితరోన్నతవస్తువు లెన్నఁ గీన వె
ల్తిగ నలకాధినాథులు గదే పురిలో మను వైశ్యపుంగవుల్.
| 199
|
ఏర్చూరి సింగయ్య - కువలయాశ్వచరిత
తే. |
శేషఫణులకు మణులైనఁ జేరి యమ్మఁ
గోరి రత్నాకరంబైన గుత్త గొనఁగఁ
జాలి [5]పైవస్తుసంచయసమితి నొనరి
పరఁగుదురు వైశ్యవర్యు లప్పట్టణమున.
| 200
|
తులసి బసవయ్య - సావిత్రికథ
క. |
అపూర్ణశంఖపద్మమ
హపద్మాధికధనాఢ్యులై పుణ్యజన
వ్యాపారవృత్తి పెంపున
నా పౌలస్త్యుని గణింప రప్పురవైశ్యుల్.
| 201
|
తిక్కన సోమయాజి - విజయసేనము
చ. |
కొనియెదమన్న [6]బండరులు కోటుల కమ్ముదు రమ్మఁబూని తె
చ్చినసర కెంత పెద్దవెల సెప్పినఁ గొండ్రు తగంగ నిచ్చి న
చ్చిన[7]వెల దీర్చి లక్ష్మి తమ చెప్పిన యట్టుల సేయ సొంపు పే
ర్కొన [8]గుఱుతింపరాదు పురికోమటులన్ బ్రణుతింపనొప్పదే.
| 202
|
- ↑ సుంకసాల
- ↑ క.యూధరవుల్
- ↑ క.శాంతికే
- ↑ ట.బొరి
- ↑ ట.పర
- ↑ క.బండములు
- ↑ ట.వెలిపార
- ↑ ట.గణుతింప