|
ప్రవ్యక్తామరభూరుహంబు లచతుర్భావాననబ్రహ్మలో
దివ్యద్వారవతీపురిం గలుగు ధాత్రీపాలు రెల్లప్పుడున్.
| 188
|
ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదచరిత [1-68]
ఉ. |
మిత్రసమానతేజులు సమిద్రఘురాములు వైరివాహినీ
గోత్రమహీధరాఘ[1]శరకోటు లఖండనిరంకుశక్రమ
క్షాత్త్రులు సామజాశ్వరథచంక్రమణైకసమర్థు లుత్తమ
క్షత్త్రియు లర్కసోమకులసంభవు లుండుదు రప్పురంబునన్.
| 189
|
తులసి బసవయ్య - సావిత్రికథ
ఉ. |
పోకులఁ బోయి యన్యసతిఁ బొందినవాఁడు సదా కళంకి దో
షాకరుఁ డుగ్రమూర్తి సముదగ్రవిషాగ్నిసహోదరుండు ప
ద్మైకవిరోధి సంతతజితాత్ముఁడు మా సరి [2]రా డటంచు ను
త్సేకముతోడ రాజు నిరసింతురు రాజకుమారు లప్పురిన్.
| 190
|
సీ. |
కమలాకరస్ఫూర్తి కాసారములయందుఁ
దమయందుఁ గలుగంగఁ దనరుచుండు
గంభీరజీవనక్రమ మగడ్తలయందుఁ
దమయందుఁ గలుగంగఁ దనరుచుండు
ధారావిహార ముత్తమతురంగములందుఁ
దమయందుఁ గలుగంగఁ దనరుచుండు
సుమనోవికాసంబు ప్రమదావనములందుఁ
దమయందుఁ గలుగంగఁ దనరుచుండు
|
|
తే. |
దానమహిమ సముత్తుంగదంతులందుఁ
దమకరములఁ గలుగంగఁ దనరుచుండు
సిరుల సంతోషమున ముఖ్యశీలవృత్తి
రణజయౌదార్యములఁ బురి రాజకులము.
| 191
|
వైశ్యులు
పెద్దపాటి సోమయ్య - అరుణాచలపురాణము
సీ. |
విపణి [3]గోరో యన్న విబుధాచలంబైనఁ
దెమ్మనఁ [4]దేని వైదేహికుండు
పులిజున్ను వలె నన్నఁ బొరుగిల్లు సూపక
|
|
- ↑ క.శత
- ↑ ట.గా
- ↑ ట.కొరో
- ↑ క.కాని