తే. |
భూమిఁ దనతోడి యిరువురుఁ బూజ గొనఁగ
ధాత యా చందమునఁ బొందఁ దాను గోరి
వివిధభూసురాకారత వెలసె ననఁగ
బ్రహ్మసంఘంబు మెఱయు నప్పట్టణమున.
| 177
|
పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత
ఉ. |
శీలము లీల లంగములు చేకొని క్రాలెడు వేదముల్ కలా
జాలము మన్కిపట్లు యతిసజ్జనసంపద దిట్ట లర్థి పూ
జాలలితప్రభావములు ++++++ ++++++ ++++++
వేలుపుఁబిండు పండువులు వీట ధరామరు లుత్తమస్థితిన్.
| 178
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [1-76]
చ. |
శ్రుతి గవుడొందినం గమలసూతికినైనను దీర్చిచెప్ప నే
రుతురు పురాణశాస్త్రములు ప్రొద్దున నిండ్లను గీరశారికా
తతులు పరీక్ష లీ విని ముదంబును బొందుదు రింద్రుపట్టమున్
క్రతువులు వే యొనర్చియును గైకొన రప్పురి విప్రసత్తముల్.
| 179
|
తెనాలి రామలింగయ - హరిలీలావిలాసము
ఉ. |
వేదపురాణశాస్త్రములు వేడుక విద్యలు సర్వయజ్ఞసం
పాదనశక్తి నిత్యనిరపాయవిధిప్రతిపాలనంబు దా
రాదిమతత్వముం గనుట హస్త[1]గతామలకంబుఁ గంట ధా
త్రీదివిజావతంసుల కరిందమ [2]మన్పురిఁ గల్గు వారికిన్.
| 180
|
[3]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-9]
క. |
క్రతుభుజులఁ గృపాపాచకు
లతిగూఢబ్రహ్మనిధికి సంజనికులు భా
రతికిని బేరోలగములు
బ్రతి లే కలరుదురు పురము బ్రాహ్మణవర్యుల్.
| 181
|
బమ్మెర పోతరాజు – దశమస్కంధము [10-1-1602]
క. |
బ్రహ్మత్వము లఘు వగు నని
బ్రహ్మయు బిరుదులకు వచ్చి పట్టఁడు గాకా
బ్రహ్మాదికళలఁ దత్పురి
బ్రహ్మజనుల్ బ్రహ్మఁ జిక్కుఁ [4]పఱుపరె చర్చన్.
| 182
|
- ↑ క.లతా
- ↑ క.మప్పురి
- ↑ సుంకసాల
- ↑ క.పఱుతురు