పుట:ప్రబంధరత్నాకరము.pdf/47

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏర్చూరి సింగయ్య - కువలయాశ్వచరిత

ఉ.

చల్లనిపండువెన్నెలల సౌధతలోన్నతహేమవేదులం
దల్లన వల్లభుల్ గదిసినట్లు సుధాకరుఁ జూచి ప్రాణముల్
ఝల్లన రాహువుం దలఁచి సయ్యనఁ బాపుదు రంకసంగతో
త్ఫుల్లవధూముఖంబులను బొల్పగు కస్తురిపత్రభంగముల్.

157

నన్నయభట్టు – ఆదిపర్వము [1-8-71]

ఉ.

ఇమ్ముగ విశ్వకర్మ రచియించిన కాంచనహర్మ్యతుంగశృం
గమ్ముల రశ్మిరేఖలు ప్రకాశములై కడుఁ బర్వి తత్సమీ
పమ్మునఁ బాఱుచున్న ఘనపంక్తులయం దచిరద్యుతప్రతా
నమ్ములఁ గ్రేణిసేయుచు ననారతముల్ విలసిల్లు నప్పురిన్.

158

తులసి బసవయ్య - సావిత్రికథ

ఉ.

అన్నగరంబు హర్మ్యములయందు ఘటించిన పద్మరాగర
త్నోన్నతకాంతిమండలము [1]లొక్కమొగిన్ జదలేటఁ బర్వినన్
కిన్నెరకాంత లాత్మఁ [2]దిలకింతురు జంబునదీప్రవాహ మి
ట్లెన్నడు వచ్చె నింగికని యెత్తిన [3]శంకల సంభ్రమంబులన్.

159

పడగలు

శ్రీనాథుని నైషధము [2-41]

శా.

వేదాభ్యాసవిశేషపూతరసనావిర్భూతభూరిస్తవా
సాదబ్రహ్మముఖౌఘ[4]విఘ్నితనవస్వర్గక్రియాకేలిచే
నాదిన్ గాధితనూజుచే సగము సేయంబడ్డ మిన్నేఱు ప్రా
సాదస్వచ్ఛధుకూలకైతవమునన్ జాలంగ నొప్పుం బురిన్.

160

మాదయగారి మల్లయ - రాజశేఖరచరిత [?]

క.

ఖరకరహిమకరులును వా
సరముల దివసాత్యయముల సాకేతపురో
దరకేతుపటలి నొడువన్
దెరలరె రవిశశులుం గడుఁ దీవ్రత నిగుడన్.

161

పణిదపు మాధవుడు – ప్రద్యుమ్నవిజయము

చ.

ఎడపక దివ్యవస్తువు లనేకము లుండుటఁజేరసి యేమిటన్
గడమ యిడంగరాని నిజగర్భభరంబున దేవతాపురిం

  1. ట.నొక్క
  2. ట.దలకింతురు
  3. సంశయ
  4. క.లేఖిత