[1]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [1-4]
క. |
పరిఖాకమఠముపైఁ దన
భరియించిన ధరణి నిల్పి ప్రాక్కమఠము త
చ్చిరవ హనశ్రమహతికా
పరిఖాజలఖేలనంబు పలుమఱు సలుపన్.
| 145
|
తులసి బసవయ్య - సావిత్రికథ
చ. |
ఉరగవధూజనంబులు పయోధరసంభృతకుంకుమాంకముల్
గరఁగ నిరంతరంబు నవగాహన మర్థి నొనర్పుచుండఁగా
నరుణరుచిం గనుంగొనంగ నందమగు బరిఖాంబుతోయ మ
ప్పురిఁ దనఘోరవీరరసముం బ్రకటింపుచునున్నకైవడిన్.
| 146
|
సౌధములు
పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత
సీ. |
బహువర్ణరత్నప్రభాతతి దివికి నొ
ప్పఁగ [2]వనాంతశ్రీవిభాతి గాఁగ
నగ్రస్థితాంగనాస్యామోదములు దివ్య
సరిదబ్జములకు వాసనలు గాఁగ
రమ్యస్థలములు నిర్జరుల చూడ్కికిఁ [3]గామ
రాగజాకరముల లాగు గాఁగ
రజతకుట్టిమకాంతిరాజరోచుల కెదు
రరుగు [4]చుట్టపుఁబిండు వరుస గాఁగ
|
|
తే. |
సరసలీలావిలాసవిస్ఫురణ గలుగు
రమణ రమణులచే నప్డు గొమరు మిగిలి
పొడవు సొబగును గలిగి యప్పురమునందు
ధర్మనిర్మితహర్మ్యముల్ పేర్మి నడరు.
| 147
|
తులసి బసవయ్య - సావిత్రికథ
సీ. |
సురవాహినీహేమసరసిజమ్ములు గోయ
జను లర్థి నిడిన నిచ్చెన లనంగ
నభ్రంబు పాథోధి యనుచు నేఁగఁగ నిల్చి
సాగిన శరదభ్రచయము లనఁగ
జవభిన్నరవిరథాశ్వములు నిల్వఁగ నోలిఁ
బన్నిన పటికంపుఁదిన్నె లనఁగ
|
|
- ↑ సుంకసాల
- ↑ ట.వనంత
- ↑ ట.గొమరౌ(?) గదా
- ↑ క.చుట్టుపూవాడ్లు