భైరవుఁడు - శ్రీరంగమహత్త్వము [1-20]
ఉ. |
పుట్టకుఁ బుట్టి కోమలికిఁ బుట్టిన ప్రాఁగవు లాదరించి చేఁ
బట్టినఁ గాదె రాఘవనృపాలక ధర్మజకీర్తిచంద్రికల్
నెట్టన మూఁడులోకములు నిండిన విప్పుడు నిందునందు[1]లన్
ముట్ట నఖర్వసర్వసుఖమూలము కావ్యము వో దలంచినన్.
| 113
|
ఉ. |
ఆకులవృత్తి రాఘవుశరాగ్రములందుఁ దృణాగ్నలగ్ననీ
రాకృతి వార్థి నిల్చుట దశాసనుఁ డీల్గుట మిథ్య గాదె వా
ల్మీకులు చెప్పకున్నఁ గృతిలేని నరేశ్వరువర్తనంబు ర
త్నాకరవేష్టితావని వినంబడ దాతఁడు మేరు వెత్తినన్.
| 114
|
జయతరాజు ముమ్మయ - విష్ణుకథానిధానము
క. |
సుతుఁడు దటాకము దేవా
యతనము నల్లిల్లు [2]నిధియు నారామము స
త్కృతియు నను సంతతులయం
దతిశయము ప్రబంధ మెపుడు నక్షయ మగుటన్.
| 115
|
కుకవినిరసనము
జయతరాజు ముమ్మయ - విష్ణుకథానిధానము
శా. |
ఆహా కావ్యము మేలుమేలనమి యన్యాయంబు వో శారదా!
ద్రోహం బేటికిఁ గట్టుకో మనుచు సంతోషించునట్లుండు న
ట్లూహాదుల్ విని సత్కవీంద్రుఁ డితరుం డొచ్చెం బపేక్షించు సం
దేహించుం దన సొమ్ము పోయినగతిన్ దీనత్వమున్ బొందుచున్.
| 116
|
[3]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [1-16]
ఉ. |
[4]సాంతము గాఁగ శబ్దహృదయజ్ఞులుగా రుచితప్రయోక్తలై
వింతలుగాఁ బ్రబంధముల వీథులు ద్రొక్కఁగ లేరు శక్తులై
దొంతర జల్లి బొంత లెడఁగూర్చి గతార్థము గూర్చు దుష్టవి
భ్రాంతుల సంగతిం దడవఁ బాసె రసజ్ఞులకుం గవిత్వముల్.
| 117
|
- ↑ క.మున్
- ↑ క.నిధాన
- ↑ సుంకసాల
- ↑ క.అంతము