పుట:ప్రబంధరత్నాకరము.pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శతకంబు చెప్పి భాస్కరుని మెచ్చగఁ జేసి
              యురుదేహుఁడైన మయూరుఁ గొలిచి


తే.

భవుని మెప్పించి కన్నులు [1]వడసి తెచ్చి
వనిత కిచ్చిన కాళిదాసునికి మ్రొక్కి
హరుని [2]వినతులచేఁ <ref>క.బాత</refబాస లాడఁజేసి
నట్టి ధట్టుని నన్నయభట్టుఁ బొగడి.

102

కవిలోకబ్రహ్మ – అరుణాచలపురాణము

[పెదపాటి సోమరాజు]

సీ.

వ్యాసుని వాల్మీకి వరరుచి వామను
              [3]భాను క్షేమేంద్రునిఁ బ్రవరసేనుఁ
గర్ణామృతు మయూరుఁ గాలాంతకుఁ గళింగు
              కవిదైత్యు శివదాసుఁ గాళిదాసు
భట్టార హరిచంద్రు భట్టనారాయణు
              భట్టగోపాలుని భట్టబాణు
భాసు భామహు సార్వభౌముని శివభద్రు
              భారవి భవభూతి భర్తృహరిని


తే.

రాజశేఖరుఁ జోరు మురారిఁ గృష్ణ
మిశ్రు జయదేవు దండి సౌమిల్లు సోమ
చంద్రు [4]దిఙ్నాగు విజయ విశాలదేవు
హర్షుఁ జిత్తపు శాతవాహను సుబంధు
మాఘ మల్హణు బిల్హణు మఱియుఁ గలుగు
[[5]ప్రథితగీర్వాణకవులను బ్రణుతి సేసి].

103

[?]

సీ.

ప్రతిభావిలంఘితభారతబహుకథా
              ఘట్టు నన్నయభట్టుఁ గడు భజించి
యుభయభాషాప్రౌఢిమోద్యన్మహా[6]రాజ్య
              భాజిఁ దిక్కనసోమయాజిఁ బొగడి
వాక్ప్రతోషితదక్షవాటీమహాస్థాన
              భీము వేములవాడ భీముఁ గొలిచి
భావబంధనిబంధ పరమేశ బిరుదప్ర
              [7]శర్మ నెఱ్ఱయ [8]శర్మ నుతించి

  1. క.బండి
  2. ట.వినుతులచే
  3. క.ట.బాణు
  4. క.దిఙ్మరు
  5. క.లో లేదు.
  6. క.రాజ
  7. ట.శర్ము
  8. ట.శర్ము