|
జైతన్యసంపదాస్పదభాతి దివిఁ బర్వు
శాతమన్యవచాపభూతి యనఁగ
జడధి నుండక మింటఁ జరియించుటకు మూర్తి
పొలుపు దాల్చిన రత్నపుంజ మనఁగ
|
|
తే. |
వివిధమండనభవవిభావిభవజటిల
నిఖిలదిక్చక్రవాళుఁడై నిరుపమాన
జవసముల్లాసగగనసంచారగరిమ
చెలువు నెలవయ్యె నప్పు డప్పులుఁగుఱేఁడు.
| 90
|
శేషస్తుతి
నన్నయభట్టు – ఆదిపర్వము [1-1-104]
చ. |
బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ
సహితమహామహీభర మజస్రసహస్రఫణాళిఁ దాల్చి దు
స్సహతరమూర్తికిన్ జలధిశాయికిఁ బాయక శయ్యయైన య
య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.
| 91
|
భైరవుని శ్రీరంగమాహాత్మ్యము [1-2]
మ. |
శయనంబై యుపధానమై నిలయమై సచ్ఛత్రమై పాదుకా
ద్వయమై మంగళపీఠమై మృదులవస్త్రంబై సమస్తోచిత
క్రియలన్ జక్రికి నిత్యసన్నిహితమూర్తిన్ బొల్చు శేషాహి న
క్షయమేధానిధిఁ గావ్యలక్షణకళాచార్యున్ బ్రశంసించెదన్.
| 92
|
ఆ. |
పదియుఁ బదియుఁ బదియుఁ బదియేనుఁ బదియేను
నిరువదేను నూటయిరువదేను
నూఱు నూఱు నూఱు, యిన్నూఱు మున్నూఱు
తలలవాఁడు మిమ్ము ధన్యుఁజేయు.
| 93
|
మదనస్తుతి
చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనము
చ. |
గొనయము తమ్మినూల్ చెఱకుఁగోల ధనుర్లత [1]పువ్వుటమ్ము లే
టును నొకమాయ మాయతో నతనుఁ[2]డున్ మును నుగ్రు జయించి జీవరా
శి నొడుచు టేమిచెప్పనని చేయు నుతుల్ దగు మోహనప్రవ
ర్తన గల కాముఁ డీవుత ముదంబున [3]మా కిలఁ గామసౌఖ్యముల్.
| 94
|
- ↑ ట.పూవులమ్ము
- ↑ క.డుర్వర
- ↑ ట.మీ