మైలారస్తుతి
[వల్లభామాత్యుఁడు] వీథినాటకము [145]
సీ. |
శనివారసిద్ధి సజ్జనపారిజాతంబు,
[వరదాత] యాదిత్యవార[భోగి]
మా లచ్చి రమణుండు మాపాలి పెన్నిధి
[1](మాళవీప్రియభర్త మహితయశుఁడు
కత్రశాలస్వామి కరుణాపయోరాశి
పుణ్యకీర్తనుఁ [2]డైన [3]ప్రోలి యయ్య
[4]పల్లెమ్మనాయకుం డెల్ల వేల్పుల రాజు
[5][గనపవేఁటల వేడ్కకాండ్ర భర్త
|
|
తే. |
మంచు కుంచాలఁ గొలువంగ మాయలేళ్ళఁ
బట్టి కట్టంగ నేర్చిన బాసవెల్లి
భైరవుని తోడిజోడు మైలారుదేవుఁ
డోరుఁగంటి నివాసి మే లొసఁగుఁగాత].
| 87
|
మ. |
పొల గయ్యంబుల ముద్దుటల్క కలనన్ బుష్పాయుధారాతి మ్రొ
క్కుల దీర్పన్ దలమీఁదఁ గాననగు నీ క్రొమ్మేను పుణ్యాంగనా
తిలకంబైన భవానిపాదనఖపంక్తిం జెంద డెందంబులోఁ
దల తాల్చు న్నెలతోడి మక్కువలు చంద్రా! రోహిణీవల్లభా!
| 88
|
వైనతేయస్తుతి
భైరవుని శ్రీరంగమాహాత్మ్యము [1-3]
ఉ. |
ఆయతచండతుండనిహతాహినికాయునిఁ దప్తహాటక
చ్ఛాయుని సర్వవేదమయసన్నుతకాయుని దేవదానవా
జేయుని నప్రమేయుని నశేషవిహంగకులాధిపత్యధౌ
రేయునిఁ బ్రస్తుతింతు సుచరిత్రవిధేయుని వైనతేయునిన్.
| 89
|
భావన పెమ్మన - అనిరుద్ధచరిత్ర
సీ. |
ఉప్పరం బెగయఁగ నొదవిన వెరవున
సడిసన్న రోహణశైల మనఁగ
వినతాసుతాకృతి వినువీథి వర్తిల్లు
బాలభానుప్రభాపటల మనఁగఁ
|
|
- ↑ క.ఇహపరదాని జంభీరమగుఁడు ?
- ↑ క.డన
- ↑ క.బోలి
- ↑ క.పల్లెంబనాయఁడు యెల్ల
- ↑ తాటాకుశిథిలము. సగము పోయినది.