తెనాలి రామలింగయ – హరివి(లాస)ము
ఉ. |
ఆ మునిసార్వభౌముఁడు సమంచితకాం(చనపారి)జాతరా
జీమతిఫేనభానికరజిత్వరతత్పరమాణఫేనిల
శ్రీమతివాతధూతజలకశీరసేకపవిత్రితాంకధా
త్రీమతి దర్పితాఖిలసుధీమతి గోమతిఁ గాంచె ముందటన్.
| 162
|
పుణ్యక్షేత్రము
జక్కన – సాహసాంకము [2-191]
చ. |
చెలువగు కాళికామహిమ చిత్రము బెబ్బులి లేడి మ్రింగి యాఁ
కలి చెడ కెద్దుఁ బట్టఁ బులికాటున నెద్దును నెద్దుపోటునం
బులియును జీవముం [1]దొరఁగ భోరున [2]లేడొక లేడిఁ బుట్టుటన్
[3]పులి పులుతోలు [4]గప్పుటయుఁ బొల్పగు నెద్దొక నెద్దు నెక్కుటల్.
| 163
|
క. |
ఆ కాశిఁ దెగిన నరునకు
నాకాశనదీజలంబు లౌదల నుండున్
కాకోదరుఁడు (దెశిశీను?)
కాకోదరు + + + + + గా కేలుండున్.
| 164
|
తెనాలి రామలింగయ – హరి[లీలావిలాసము]
తే. |
ఈఁతపంటికిఁ దాటిపం డింత కింత
మ[శకమైనను] గొండొకశశకమైనఁ
కాశికాసీమఁ గడనిద్రఁ గ[న్ను మొగి]చి
మేరుధను వెత్తి కదలని తేరు నడుపు.
| 165
|
శ్రీనాథుఁడు – భీమఖండము [3-25]
తే. |
కార్తికీవేళ భీమశంకరుని న[గరఁ]
దూఱుఁ నెవ్వాఁడు చిచ్చఱతోరణంబు
నతఁడు [దూఱఁడు] ప్రాణనిర్యాణవేళ
ఘోరయమపట్ట[ణద్వార]తోరణంబు.
| 166
|
చ. |
శకలము నందె [మౌనిసతి] జారసహోదరుఁ జూడఁగల్గెనే
టికి వెదనొందు శ్రీగిరిపతిం దరిశింపఁగఁ గోర్కి లేక కా
శికిఁ జనెఁ బూపచంద్రునికిఁ జిచ్చరకంటికిఁ జిత్తజన్ముభూ
|
|
- ↑ చ.దొలగి
- ↑ చ.వేరొక
- ↑ చ.జలిజలితోలు
- ↑ చ.గట్టుటయు