|
జనకాధీశాత్మజాధీశ్వర[1]ధనురతివిస్తారితా[వర్త]భద్రున్
[2]స్వనదంభోదాతిరౌద్రున్ వరతటవిహితోచ్ఛ్వాసముద్రున్ సముద్రున్.
| 146
|
[3]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [6-108]
మహాస్రగ్ధర. |
కని రంతర్మగ్నభూభృత్కబళనచ[టుల]గ్రాహసంచారధాటీ
జనిత[4]స్పర్థాళువీచీసముదయలహరీసంభ్రమద్భోగిపూత్కా
రనిరంతో[5]త్పాతితక్షీరవితతఘన[6]ధారాసహస్రస్వభావన్
ఖనదీస్వైరోపగూహూద్గతసుఖసుముఖాకారలబ్ధిన్ పయోబ్ధిన్.
| 147
|
చరిగొండ ధర్మయ – చిత్రభారతము [5-3]
మహాస్రగ్ధర. |
కనియె న్భూపాలుఁ డత్యుగ్రమకరకమఠగ్రాహపాఠీనరంగ
ద్ఘనభంగాభంగఘోష[పితనిఖిలిది]దిక్చక్రకుంభీంద్రనిద్రున్
వినుతాత్మద్వీపమధ్యా[విరతపటుసభా]వేశ్మనిద్రావశశ్రీ
వనితారాట్తల్పభోగీశ్వర[భరమణిదు]ర్వర్గభద్రున్ సముద్రున్.
| 148
|
సముద్రలంఘనము
ఉ. |
+ + ను వంచి దీని + + + ౦కగదోంక గదల్చి పాదముల్
వివ్వక పె + + + లను వీచిముఖంబు బిగించి కొండ జా
జవ్వుమనంగ + + గిలె నక్కకు వీంపి + + + యద్ది పై
రివ్వున దాటెవో + + మ ఱెక్కలతోడి సురాద్రియో యనన్.
| 149
|
మొల్లరామాయణము – సుందరకాండము – 225ప
క. |
అడుగులు సమముగ నిడుకొని
వడి బాహు[వు లూఁ]ది నిక్కి వాయుజుఁ డంతన్
ఎదలూచి దాటె జల[నిధి]
[మిడి]వింటన్ బసిఁడియుండ మీఁటిన భంగిన్.
| 150
|
సముద్రమథనము
శ్రీనాథుఁడు – భీమఖండము [4-59]
సీ. |
కపటకచ్ఛపమైన కైటభాంతకు వీఁపు
కొమరు మీఱిన [7]చుట్టకుదురు గాఁగ
నారసాతలమూలమైన మందరమహా
ధరణీధరంబు మంథానకముగ
|
|
- ↑ పసురని
- ↑ ఘనదంబుదృష్టకాద్రున్
- ↑ సుంకసాల
- ↑ చ.స్వర్థాను
- ↑ చ.పాలిత
- ↑ చ.రాకా
- ↑ చ.మట్టి