|
[బ]హుసువస్తువుఁ గన్న భాగ్యంబుఁ బల్కుచోఁ
దన పేర్మి[యగుఁ బం]తమునకుఁగూడ
|
|
తే. |
మరియు మంచితనంబుల యొరువు [మురువు]
చెప్పఁబూనఁగ దానయై చెన్ను మిగులఁ
దనకు సాటి[వస్తువుఁ దలఁ]పఁ దాన యగుచు
నఖిలసౌభాగ్య మయ్యె న[య్యంబు]రాశి.
| 142
|
సీ. |
అసమబాణుని మాత వెసఁగన్న పురిటిల్లు
భూతనాథుని వేఁడి బోనమిల్లు
కూటవ వేల్పుల కుడివెన్న తరియిల్లు
పుణ్యపుఁ గోమలి పుట్టినిల్లు
పాఁపపాన్పులవాని పవ్వళింపుల యిల్లు
జలచరగ్రహముల సత్రమిల్లు
వాలిసుగ్రీవులవా రత్తవారిల్లు
కొండులు దాగెడు గొందిటిల్లు
|
|
తే. |
కలితసురగజహయముల కట్టుమట్టు
మణులు గన్పట్టు వెల్లువ మనికిపట్టు
వాహినుల కూఁత వారిదవ్రజము మేఁత
యీఁతులకు నీఁత పెనుమ్రోఁత ప్రాఁతజలధి.
| 143
|
[1]అయ్యలార్యుఁడు – యుద్ధకాండశేషము [1745]
చ. |
కనియెఁ గపీంద్రుఁ డంత ఘన[2]గర్జననిస్వనవీతనిద్రమున్
ఘనతిమినక్రచంక్రమణకల్పితవీచికదంబభద్రమున్
గనదురురత్నరాజి[భుజగవ్రజ][3]సంచరణాతిరౌద్రమున్
జనితమరాళఫేన[విలసన్నవము]ద్రము నా సముద్రమున్.
| 144
|
పెద్దిరాజు – ప్రద్యుమ్న[చరిత్ర]
స్రగ్ధర. |
దైతేయుం డంతఁ జూచెన్ దతసలిలతలద్వా[రదుర్వా]రలీలా
పాతోన్మజ్జన్నిమజ్జబహులచరాపా[రగంభీ]రశశ్వ
ద్వాతూలస్థూలకేలీవశవిశదకణావాలకల్లోల[మాలా]
జాతాఖాతాదిరౌద్రున్ జలదచలకులాసన్నభ[ద్రున్ సము]ద్రున్.
| 145
|
కొరవి గోపయ - సింహాసనద్వాత్రింశిక [2-159]
మహాస్రగ్ధర. |
కనియెన్ [దుర్వారద]ర్వీకర[మకర]ఝషగ్రాహరక్షావినిద్రున్
[ఘనవీచీ]సద్భుజాభ్రంకష[4]గుణసమతిక్రాంతకాలాంతరుద్రున్
|
|
- ↑ అయిలన
- ↑ చ.గర్జితనిస్వన
- ↑ చ.నన్ వెలనాతికాద్రమున్
- ↑ చ.నహాన