సీ. |
పులిమల్లఁ డడవిపోతులరాజు [1]గరుడుండు
గాలివేగంబు పందేలపసిఁడి
విరిముప్ప చేపట్టి వెండి గుందుప్పర
పచ్చిమిర్యము వెఱ్ఱిపుచ్చకాయ
వేఁట మాణిక్యంబు విరవాది మెడబల్మి
పెటకొండి యుపకారి పిడుగుతునక
జిగురుండు చిత్రాంగి సివ్వంగి బరిగోల
పొలియడు కస్తూరి బొండుమల్లె
|
|
తే. |
యనఁగ మఱియుఁ బెక్కు[2]దోయముల పేళ్ళు
దారకులు దేరవచ్చె నుద్దండవృత్తి
వేఁటకుక్కలు మృగరాజవిగ్రహములు
వటుకనాథుని వాహ్యాళివాహనములు.
| 134
|
[ప్రౌఢకవి మల్లన] – రుక్మాంగదము [3-69]
సీ. |
[3]గడికోట బసవశంకరుఁడు చొప్ప[రికాఁడు]
[కాట్రేఁ]డు జగజెట్టి గాలిపడగ
కొండీఁడు పులియ[మార్కోలు] గండండు ను
[దురు]గాలి మాష్టీఁడు దొంగలబొజుఁగు
[బండిమల్లఁ]డు వెండిగుండు చిచ్చరుగోల
పట్టుగొల్లె నభూతభైరవుండు
[కొదమ]సింగము మెట్టుగుదియ గోటలగొంగఁ
డాదిభైరవుఁ[డు మోహ]నమురారి
|
|
తే. |
చలిపిడుగు విక్రమార్కుఁడు [4]బలుదలారి
య[నెడు నామం]బులను జేర్చు నవనినాథు
నగరి జాగిలముల నేర్చి [తగినరీతి]
గొలుసులను బట్టి చని రొక్క కొంద ఱపుడు.
| 135
|
సీ. |
[వలల కా]వళ్ళు చివ్వంగుల [5]బండులు
తిరుచుట్టు [6]బొంగుకాలురులు[చీరె]
[తె]రులు నుగంబులు దీమముల్ మారము
ల్మెకదారి కత్తులు [మెకము బో]ను
లొఱపైన గొడ్డండ్లు మెఱుఁగు బల్లెంబులు
|
|
- ↑ చ.లశామతి
- ↑ చ.దోవతుల
- ↑ చ.నలి
- ↑ చ.జలదరారి
- ↑ చ.బిళ్ళును
- ↑ చ.సొంగులు తెఱపు