|
గోరి వరించితమ్మ నినుఁ గొల్వక యూరక యేలఁగల్గు సం
సారసుఖంబు లీమనుజసంతతికిన్ దలపోయ నంబికా.
| 68
|
సరస్వతీస్తుతి
సీ. |
సింహాసనము చారుసితపుండరీకంబు
చెలికత్తె చెలువారు పలుకుఁజిలుక
శృంగారకుసుమంబు చిన్నిచుక్కలరాజు
పసిఁడికిన్నెరవీణ పలుకుఁదోడు
నలువ నెమ్మోముఁదమ్ములు కేళిగృహములు
తళుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు
చక్కని రాయంచ యొక్కిరింత
|
|
తే. |
యెపుడు నే దేవి కా దేవి యిందుకుంద
చంద్రచందనమందారచారువర్ణ
శారదాదేవి మామకస్వాంతవీథి
నిండువేడుక విహరింపుచుండుఁగాత.
| 69
|
[1]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [1-5]
శా. |
కాసారంబులు సాహిణంబులు సరిత్కాంతుండు పూఁదోట వి
ద్యాసీమంబులు రచ్చపట్లు సురకాంతాలోకసీమంతభూ
షాసింధూరము పాద[2]లాక్ష యగు భాషాదేవి మత్ప్రౌఢజి
హ్వాసింహాసన మూనుఁగాతఁ [3]గృతియుక్తాలంక్రియాహంక్రియన్.
| 70
|
పెద్దిరాజు - అలంకారము [1-3]
చ. |
వరచతురాననప్రతిభ [4]వాసికి నెక్కఁ బదక్రమంబులన్
దిరుగుచు నంగవిభ్రమము ధీముకురంబులఁ గానిపించుచున్
సరసవచస్సవిత్రి యగు చామ యలంకృతులన్ దనర్చి సు
స్థిరతఁ జళుక్యవిశ్వనృపశేఖరు హస్తమునందు నుండెడున్.
| 71
|
తులసి బసవయ్య - సావిత్రికథ
మ. |
లలితాహంకృతిచేత రాచిలుక తాళం బుగ్గడింపం గరాం
చలవాచాలవిపంచికారణచంచద్గానముం గూడి యు
|
|
- ↑ సుంక
- ↑ క.రక్ష
- ↑ క.ధృతి
- ↑ క.వాసన కెక్క