చ. |
తమ ముఖదర్పణ[౦బు]లు ముదంబున నాసవపూర్ణపాత్రలం
దమరఁగఁ దోఁచినన్ జలరుహాక్షులు గన్గొని రోహిణీసతీ
రమణునిఁ గట్టి రేమనఁ [1]గరంబుల [2]శీధురసంబుఁ గ్రోలఁగాఁ
బ్రమద మెలర్ప నిందుఁ బడి పాయదు తన్మధురప్రయత్నుఁడై.
| 112
|
తెనాలి రామలింగయ – హరిలీలావిలాసము
సీ. |
సింధుపూరితముగాఁ జిప్ప నివాళింపు
జేవెలుంగిడి చూచుఁ జేతి మదిర
యించుక చవిగొను నించుఁ జేరువనున్న
బోటికిఁ బొలముట్టి తేట లించు
నొక యేలపదము మిన్నక పాడి తోడన
నేమంటినే యేను నేరికైన
సవరని మొగమెత్తు జాబిల్లి నీక్షించుఁ
గడు రహస్యములైన కడల నాడు
|
|
తే. |
మెచ్చుఁ దలయూఁచు నగుఁ దోన[వచ్చుఁ జెంత]
నలరు లోఁబడు జాతులఁ గలియఁ దరుల
నొఱగు [తొలఁ]గు నేర్పెఱుఁగు నలరు[లు దాల్చు]
మగువ యొక్కతె మధుపాన[మత్త యగు]చు.
| 113
|
సిద్ధపురుషుఁడు
సీ. |
ఆదినాథుని యపరావతారము పూని
మత్స్యేంద్ర[నాథుని] మహిమఁ [3]దనరి
సారంగనాథుని సామర్థ్యమును [బొంది]
[4]గోరక్షనాథుని గుణముఁ దాల్చి
సిద్ధబుద్ధిని బుద్ధి చిత్త[మునం జేర్చి]
[5]ఖనిరు విద్యాధికఘనతఁ జేర్చి
మేఖనాథుని మంత్రవైఖరి వహి[యించి]
[నాగార్జును]ని కళాశ్రీ గమించి
|
|
తే. |
యా విరూపాక్షుఁ డితఁడన నతిశయిల్లి
[యర్థి నవనాథసిద్ధుల] కైక్యమైన
మోహనాకృతి యితఁడను మూర్తిఁ దనరి
[చిన్మయాస్వాం]తుఁ డగు నొక్క సిద్ధవరుఁడు.
| 114
|
- ↑ చ.తంబుల
- ↑ చ.సింధు
- ↑ చ.నూని
- ↑ చ.+రొంక
- ↑ చ.నిరునివిద్యాదిఘనతజేసి