పుట:ప్రబంధరత్నాకరము.pdf/247

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధుపానము

పెద్దిరాజు – అలంకారము [3-119]

క.

సంభోగకరము మదనా
లంబనము నశేషరస[1]విలసితము నంత
ర్బింబితవదనమునగు కా
దంబరి యావాసమునకుఁ దగు నొడఁగూర్పన్.

107

[3-120]

మ.

అలినాదంబులు తాలమానములు గా[2]నాలప్తి గావించుఁ దొ
య్యలి యో[3]ర్తొక్కతె పాడు విశ్వవిభు నేలాదిప్రబంధములన్
తెలివిం గైకొని యోర్తు సారంగముగ నర్తించున్ గళాసించు ను
గ్మలి యొక్కర్తెయుఁ గ్రాలు సోలములతోఁ గాదంబరీగోష్ఠిచేన్.

109

చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [3-96]

చ.

నెలతుక యోర్తు చేతి హరినీలశిలామయపాత్రఁ బూర్ణసం
చరితతరంగయై పొదలు వారుణిఁ దోఁచు సుధాంశుమండలం
బలఘుకరాళరాహువదనాహతి స్రుక్కి కరంబుఁ [బిమ్మిటిం
గలఁ]గి పొరింబొరి న్వణకు కైవడిఁ గానఁగనయ్యె నయ్యె[డన్].

110

[4]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-160]

సీ.

కోపం[బు లేక భ్రూ]కుటి ఘటియించుఁ బో
              లింపంగ లక్ష్యంబు లేక చూచుఁ
బిలువకుండఁగ నైనఁ బలుకు నోహో యని
              బయ లూఁతగొనఁజూచుఁ బాఱఁజూచుఁ
గారణం బొండులేకయ నవ్వు వికవిక
              గ్రాలెడు నీడపై సోలజూఁచుఁ
జేరువ నెచ్చెలిఁ బేరెలుంగునఁ జీరు
              మనసు లేకయ పాడు మాని మాని


తే.

బ్రస్తు[తము గాని వెడ] తొక్కు బలుకుఁ బలుకు
మ్రోయు తేఁటులతోఁ [గూడి ముచ్చటా]డు
నుబ్బి జాబిల్లిఁ బిలుచు రాకున్న నలుగు
మ[గువ యొక్క]తె మధుమదోన్మత్త యగుచు.

111
  1. చ.విలాసిత
  2. చ.నాడంతి
  3. చ.తోంకతె
  4. సుంకిసాల