పుట:ప్రబంధరత్నాకరము.pdf/240

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నసమసంగీతలహరిఁ బ్రియాళములను
జారుముఖగంధముల సిందువారములను
ప్రౌఢనఖరాంకురక్రీడఁ బాటలముల
నాదరంబార నంతంతఁ బ్రోది చేసి.

78

ఘటవాసి మల్లుభట్టు – జలపాలిమాహాత్మ్యము

సీ.

అతివ [1]పాదాంబుజాహతి నశోకము పూచె
              [2]వెలది యూర్పునకు [3]వావిలి [4]హళించె
లలన చూపులచేతఁ [5]దిలకంబు పులకించెఁ
              గోమలి కౌఁగిటఁ గొరవి ననచెఁ
గామినీవదనసంగతి నుబ్బె సంపెంగ
              తరుణిచేఁబడ్డ చూతము ఫలించె
వనితగీతమున ప్రేంఖణము వాసన మించె
              నారి నవ్విన కర్ణికార మలరె


తే.

నాతి మాటలవలనఁ బున్నాగతరువు
పొలఁతి మద్యంబు లుమియంగఁ బొగడ మించెఁ
జంద్రవదనలు విహరించు చతురగరిమ
నీరసంబులు సారస్యనిరతిఁ బొందె.

79

బొడ్డపాటి పేరయ – శంకరవిజయము

తే.

పాది గండూషమధు వుల్కి పల్కుజిఁల్కఁ
జూచి గోరొత్తి ముద్దిడి చాఁచి నవ్వి
[6]యూపు దాలించి కౌఁగిట నుపచరించి
ననువుచే నుండెఁ దరువులో నాథులొక్కొ.

80

అళివర్ణన

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

మ.

సకలారామములన్ మదాళి వినుతుల్ [7]సంపూర్ణమై యొప్పుఁ బు
ష్పకదంబంబుల హత్తుచున్ విడుచుచున్ [8]చాటించు చొక్కించు కిం
చుక కప్పించుచుఁ బాంథచిత్తములు సంక్షేపింపఁగా మ్రోయుచున్
ప్రకటానంగధనుర్గుణక్రియలు చూపన్ దారియై యేపునన్.

81
  1. చ.రాగంబు
  2. చ.నలది
  3. చ.నావిరి
  4. చ.హరించె
  5. చ.వికలంబు
  6. చ.పూవు
  7. చ.సంపూర్ణులై
  8. చ.గ్రీడించి