పుట:ప్రబంధరత్నాకరము.pdf/239

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గజ్జలాంతకటాక్షకచరుచుల్ వొలయుచోఁ
              [1]దలిరులు విరులును నళులు గాఁగఁ
గక్షవక్షోజాంగకచ్ఛవి సోఁకిన
              నన్నియు గోరింట లగుచు మెఱయ


తే.

వెఱగుపడి నవ్వు నవ్వుచో వింతరీతి
నిల్పియును గుసుమంబులే నివ్వటిల్లఁ
దన తనూవిభ్రమములని తలఁప కొకతె
గుఱుతు లరయుచు నొకభంగిఁ గొనియె విరులు.

75

దశదోహదములు

ముక్కు తిమ్మయ – పారిజాతము [4-9]

మ.

విను మింతు ల్దిలకంబుఁ జంపకముఁ [2]గ్రోవిన్ సిందువారంబుఁ బ్రేం
కనమున్ మామిడి గోఁగుఁ బొన్నఁబొగడన్ గంకేలి నూహించి క
న్గొన మో మెత్తఁగఁ గౌఁగిలించుకొన మూర్కోఁ బాడఁ జే నంటఁ బ
ల్క నగం గ ల్లుమియంగఁ దన్న ననుచున్ [3]గల్పాగ మాయావిరుల్‌.

76

[4-10]

చ.

కనఁ [4]దిలకంబుఁ గేసరముఁ గ ల్లుమియ న్రహిఁ బాడఁ బ్రేంకనం
బు [5]నిముర మావి నవ్వ సురపొన్న ముఖాంబుజ మెత్తఁ జంపకం
బు నెఱ గవుంగిలిం గొరవి మూర్కొన వావిలిఁ దన్న [6]వంజులం
బు [7]నుడువ గోఁగునై తరుణి! పూఁచు సురద్రుమ [8]మిన్నిపువ్వులున్‌.

77

భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-61]

సీ.

పాణిపల్లవమృదుస్పర్శఁ జూతంబుల
              సుకరాంఘ్రిహతుల నశోకములను
గలభాషణంబులఁ గర్ణికారంబుల
              వదనాసవంబుల వకుళములను
పరిరంభణంబులఁ గురువకప్రతతుల
              దృగ్విలాసంబులఁ దిలకములను
దరహాసకాంతిసంతతి సురపొన్నల
              సమదరాగంబులఁ జంపకముల

  1. చ.తరువిరులు
  2. చ.కోటిం
  3. చ.కల్పాకంబులై యవ్విరుల్
  4. చ.నుడికంపు
  5. చ.నెవుర
  6. చ.మంజులం
  7. చ.నుదురె
  8. చ.మన్ని