నాచిరాజు సోమయ - [1]మత్తలీలావిలాసము
చ. |
సుకృతము కాచెఁగాక చెలి జూదరిపట్టు మదాళిమాలికా
చికుర[2]భరంబు జీర్ణదళచేలములుం గుదియింపఁ [3]ద్రెవ్వునే
సకలవనావనీద్రుపదజాతజనార్దనుభంగిఁ జూడఁడే
యకట వసంతుఁ డీ కిసలయాంశుకసంహతి పెద్ద సేయుటన్.
| 58
|
సీ. |
రాజకీరకుమారరాజి కక్షరశిక్ష
మొనరింప వచ్చిన యొజ్జ యనంగఁ
గలకంఠనికురుంబకములకు వాకట్టు
విడిపింప వచ్చిన మొజ్జ యనంగఁ
దరులతాదులకు వార్థకము మానంగ మందు
సేయంగ వచ్చిన సిద్ధుఁ డనఁగ
సంప్రణయక్రోధజంపతినివహంబుఁ
గలుప [4]వచ్చిన చెలికాఁ డనంగ
|
|
తే. |
మందమారుతోద్ధూతమరందబిందు
సిక్తషట్పదజ్యారవశ్రీవిలాస
మకరకేతుప్రతాపసమగ్రమై వ
సంత మేతెంచె సంతతోత్సవ మెలర్ప.
| 59
|
ముక్కు తిమ్మన – పారిజాతము [3-51]
సీ. |
పరువంబుగాక చొప్పడని మామిడితేనె
లాన నాసాస నఱ్ఱాడునవియుఁ
దమకించి చిగురాకు [5]గమిచి నో రొగరైనఁ
గడఁగి గొజ్జఁగినీటఁ గడుగునవియు
[సంపెంగపొదరింటి చక్కి గోరఁటఁ గాంచి
యుసురంచు మగిడి నోరూరునవియుఁ]
గలిగొట్టు [6]పసరుమొగ్గలఁ [7]గోర్కి పొలివోయి
మునుపటి మొల్లల మూఁగు నవియుఁ
|
|
ఆ. |
ననుచుఁ దేఁటికదుపు లామనిఁ దలసూపెఁ
జూపుదనుక నెల్లచోటఁ దోఁట
యందుఁ దామ యగుచు నమ్మరు నెలగోలు
[8]పౌఁజు లనఁగఁ జూడ్కి పండువయ్యె.
| 60
|
- ↑ దత్త
- ↑ చ.ఫలంబు
- ↑ చ.పెంపు
- ↑ చ.దలచిన
- ↑ చ.గరచి
- ↑ చ.సొబగు
- ↑ చ.కోకో
- ↑ చ.పండు గ