వసంతఋతువు
పెద్దిరాజు – అలంకారము [3-99]
క. |
అంకురపల్లవపత్రస
మంకితముకుళప్రసూనహారిఫలములన్
బొంకములగు వనములు ని
శ్శంకముగ నుతింపదఁగు వసంతములందున్.
| 48
|
మ. |
స్మరబాణంబులు వాఁడులయ్యె గుణవిస్ఫారంబు ఘోరంబుగా
నెరసెం గీరము లంగజాతబిరుదానీకంబుఁ గీర్తించె మిం
చె రసాలాగ్నులు పల్లవార్చులఁ దనర్చెం జంద్రవంశ్యావనీ
వరుతో నల్గుట చెల్లునే [1]యనతయై వామాక్షి కీపట్టునన్.
| 49
|
పోతురాజు భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-37]
ఉ. |
సంతతపుష్పసౌరభసుజాతి దిగంతము పాంథమర్మభి
త్కుంత ముదాత్తమత్తపికఘోషితమన్మథరాజ్యవైభవో
దంతము జంతుజాతసుఖదస్థితిమంతము [2]దూరధూతహే
మంతము సర్వసాక్షిగ సమగ్రతఁ జూపె వనాంతరంబునన్.
| 50
|
[3]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-2]
ఉ. |
భాసురలీల నయ్యె నిలపై మధుమాసము గర్వితేక్షుబా
ణాసకృతాట్టహాసము భయాకులపాంథవిముక్తదీర్ఘని
శ్వాసము కోపనా[4]ధృతినివాసము కోకిలకీరషట్పదో
ల్లాసము దత్తభూరుహవిలాసము సర్వమనోవికాసమై.
| 51
|
చ. |
తెగిన మనోభవుం దిరుగఁదెచ్చి కుజంబులకెల్లఁ బ్రాయముల్
మగుడఁగ నిచ్చి యన్యభృతమండలి మూఁగతనంబు పుచ్చి ము
జ్జగముల వార్తకెక్కిన వసంతభిషగ్వరుఁ డాప్తుఁ డయ్యునుం
దగుగతి మాన్పలేఁడు మఱి దక్షిణవాయువు నందు జాడ్యమై.
| 52
|
సీ. |
రేల వెన్నెలలు పండ్రెండు సూర్యులఁ జూపు
బీరెండలై కాసి నీరసింప
|
|
- ↑ చ.యలపయై
- ↑ చ.చేరె మాత
- ↑ సుంకిసాల
- ↑ చ.భృతి