[1]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [6-26]
ఉ. |
అంతఁ గ్రమంబుతోడ శరదంతమునన్ బరియుక్తమై బలం
బంతయుఁ జెల్లుటం జులకనై [తెలుపై]న మొయిళ్ళు గాడ్పుచే
నెంతయు ధూళియై విరిసి యీగతిఁ దూలెనొకో యనంగ హే
మంతమహోదయంబున హిమంబు తమంబుగ ముంచె లోకమున్.
| 39
|
ఉ. |
+ + + + + + + + + + + + + + + + + + + + +
+ + + పద్మదైత్యహనుమంతము మన్మథకుంభిడింభవే
శంతము నక్తమాలదశశస్త్రవిలూనశరద్విలాససా
మంత మనంతదూరతరమానవతీజనకాంత మెంతయున్.
| 39క
|
పెద్దిరాజు – అలంకారము [3-109]
క. |
భృశవిచ్ఛిన్నంబగు ది
గ్దశకంబును గమలరుహవితానముఁ బ్రాతః
ప్రశిథిలరవికరమునుగా
శిశిరముఁ బొగడంగఁదగు విశేషక్రియలన్.
| 40
|
చ. |
వెరవున నాత్మవంశుఁడగు విశ్వనరేశ్వరుమీఁది ప్రీతిఁ జం
దురుఁడు తుషారసంహితుల దొట్టిగఁ బంచిన వచ్చి యచ్చటన్
బరిగొనఁబోలు నంచుఁ జెడి పాఱిన వైరులు భీతిఁ గానలోఁ
దిరముగ నిల్వనేరరొకదే యని చూతురు పందలాత్మలన్.
| 41
|
చిమ్మపూడి అమరేశ్వరుఁడు - విక్రమసేనము
చ. |
ద్యుమణికినైన జక్కువ లెదుర్పఁగ దుస్తరమైన యట్టి శీ
తమునఁ బ్రియంబు పాటన సుధాకరమౌళికి ఫాలదేశనే
త్రమున వెలుంగు మంటల కతంబున నోరసపోయెఁగాక ని
క్కమునకు నంగమోచి మనఁగా వశమే మది నెంత గూర్చినన్.
| 42
|
బొడ్డపాటి పేరయ – శంకరవిజయము
సీ. |
మేదినీ[2]జలమెల్లఁ గేదారజల మయ్యెఁ
గాకున్న [3]వలి యుదకంబు లెట్లు
భూమిలో వడగళ్ళప్రోవు లయ్యెను భూధ
రంబులు గాదే నివంబు గలిసె
నిందుండు భాస్కరుం డిందుండు గాఁబోలు
గాకున్న రవి వేఁడి గామి యెట్లు
|
|
- ↑ సుంకిసాల లింగయ
- ↑ చ.బల
- ↑ చ.మలి