పుట:ప్రబంధరత్నాకరము.pdf/229

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మొగిఁ బాపఱేఁడు మైముడిగి నిద్రించుట
              తుహినంబు సోఁకునఁ దూలి కాదె


ఆ.

యనఁగ సకలదిశల నలమి జీవులనెల్లఁ
గంప మొందఁజేసెఁ బెంపు మిగిలి
కమలములు హరించి కమలాప్తుఁ గొలువంగ
నప్పళించి శీత మరుగుఁదెంచె.

36


సీ.

నేల యెంతెంతయు [1]నెఱి చంద్రకాంతపు
              రాలఁ గట్టించినలీల మెఱసె
నింగి యెంతెంతయుఁ బొంగి దుగ్ధాంభోధి
              నిట్ట పట్టినమాడ్కి దట్ట మయ్యె
దిక్కు లెన్నెన్నియు నొక్కటి వెలిపట్టి
              తెరచీర లెత్తినకరణిఁ దోఁచెఁ
గొండ లెన్నెన్నియుఁ గొమరాడు హరికతో(?)
              కలయఁ బర్వినరీతిఁ దెలుపు చూపెఁ


తే.

దరువు లెల్లను ఘనసారతరువు లయ్యెఁ
గొండ లెల్లను హరు వెండికొండ లయ్యె
గజము లెల్లను నమరేంద్రు గజము లయ్యె
గురుతరంబగు పెనుమంచు కురియు కతన.

37

భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-36]

సీ.

ప్రత్యూషజృంభితప్రాలేయదుర్లక్ష్య
              మాణపద్మభవాండమండలంబు
సంకులద్వాసరసమయ[2]మందిరభవ
              ద్యోతఖద్యోత[3]భానూత్కరంబు
వితతనిశీధినీవేళాసహస్ఫీత
              శీతరుగ్బింబవిజృంభణంబు
శీతాంశుదుర్విధవ్రాతసంచితకరీ
              షాగ్నిధూమావృతాశాంతరంబు


తే.

నగుచు నంతంత [4]కెగసె నీహారధరణి
ధరసముద్ధూతనిబిడశీతలసమీర
ణాభిసంపాతజాతమాయాతిభీత
జంతుసంతాన మగుచు హేమంత మంత.

38
  1. చ.నెలి
  2. చ.మందిత
  3. చ.నాభాంసురంబు
  4. చ.కే సన