మల్లికార్జునభట్టు – కిష్కింధాకాండ [404]
శా. |
సోమస్ఫూర్తికరంబు నిర్మలనదీస్తోమప్రవాహంబు ని
ర్జీమూతంబు నిరస్తకర్దమధరిత్రీకంబు శుభ్రీకృత
వ్యోమాశాంతము ఫుల్లకాశముఁ దుషారోద్గారి యున్మీలితో
ద్దామాంభోజసరోవికాసము శరత్కాలంబు గానంబడెన్.
| 32
|
చ. |
దలదరవింద[1]గంధకుముదస్మిత తారకహారచంద్రికా
మలయజ బంధుజీవకు[2]సుమస్ఫురితాధర యుల్లసన్నదీ
పులిననితంబబింబ తిలపుష్పసునాసిక యుత్పలాక్షి ని
ర్మలవిధుమండలాస్య [3]యయి రమ్యశరన్నవలక్ష్మి యొప్పెడున్.
| 33
|
హేమంతఋతువు
పెద్దిరాజు – అలంకారము [3-107]
క. |
బలవ[4]త్కాలీయకకం
బళ[ఘన]కౌశేయపట్టపటమాంజిష్టం
బులఁ జనదు సీతు యువతుల
వలిచన్నులఁ దక్క ననుచు వలయున్ బొగడన్.
| 34
|
మ. |
తరుణీయౌవనగర్వజృంభితకుచోదగ్రోష్మగంధంబులన్
వరకాశ్మీరససాంకవాగురురసవ్యాసక్తులం [5]బట్టికాం
బరమాంజిష్టపటాదులన్ హిమగతిన్ బ్రాపింప రీ విశ్వభూ
వరు మెప్పించిన సత్కవీంద్రు లతులావాసంబులం దిమ్ములన్.
| 35
|
అయ్యలార్యుని సింగయ – పద్మపురాణము – ఉత్తరఖండము
సీ. |
హరి లచ్చి నేప్రొద్దు నక్కునఁ జేర్చుట
హేమంత మరుదెంచు టెఱిఁగి కాదె
హరుఁడు ఫాలంబున ననలంబుఁ దాల్చుట
తఱుచైన చలి కోర్వ వెఱచి కాదె
కూర్మంబు మేను సంకుచితంబు సేయుట
శీతాగమం బగు భీతిఁ గాదె
|
|
- ↑ చ.గంధి
- ↑ చ.కుముద
- ↑ చ.యటు
- ↑ చ.కాళేయ
- ↑ చ.బాటి