|
ఘుర్ఘరధ్వానడిండిమాఖండనినద
మభినవంబైన యా జలదాగమమున.
| 24
|
భైరవుఁడు – శ్రీరంగ[1]మహత్త్వము [2-26]
మ. |
జల[2]దాటోపవిశాల మింద్రధను[3]రంచద్వారుణీకూల ము
త్కలికాలంబకదంబసాల[4]వనమధ్యస్ఫారసవ్యావలీ
కలనా[5]వాల ముదారకేతకపరాగ[6]వ్యాళ ముర్వీధర
స్థలనృత్యన్మదకేకిజాల మగు వర్షాకాల మొప్పెం [7]గడున్.
| 25
|
బమ్మెర పోతరాజు – దశమస్కంధము - పూర్వభాగము [754]
సీ. |
పూర్వవాయువులు ప్రభూతంబులై వీచెఁ
బడమట నింద్రచాపంబు దోఁచెఁ
బరివేషయుక్తమై భానుమండల మొప్పె
మెఱపు లుత్తరదిశ మెఱవఁ దొణఁగె
దక్షిణగాములై తనరె మేఘంబులు
జలచరానీకంబు సంతసించెఁ
[జాత]కంబుల పిపాసలు కడపలఁ జేరెఁ
గాంతారవహుల గర్వ మణఁగె
|
|
ఆ. |
నిజకరాళివలన నీరజబంధుండు
దొల్లి పుచ్చుకున్న తోయ మెల్ల
మరల నిచ్చుచుండె మహిఁ గర్షకానంద
కందమైన వాన కందు వందు.
| 26
|
శరదృతువు
పెద్దిరాజు – అలంకారము [3-105]
క. |
వెన్నెల యింపును జుక్కల
చెన్నును దెలుపారు దిశల చెలువంబులు వి
చ్ఛిన్నములగు జలదంబుల
సన్నుతి సేయంగవలయు శారదవేళన్.
| 27
|
శా. |
సోమశ్రీలకు వన్నెవెట్టుచు వనస్తోమంబునం [8]బర్వునా
శామాలిన్యమునేలఁ ద్రోచు [9]నవరాజద్రాజహంసావళిన్
బ్రేమంబున్ [10]బచరించు మానసమునన్ బెంపై శరద్విభ్రమం
బామోదప్రదమైన విశ్వ[11]విభు నుద్యత్కీర్తికిన్ సాటియై.
| 28
|
- ↑ మాహాత్మ్యము
- ↑ చ.జాంతో
- ↑ చ.రంభ
- ↑ చ.ఘనపద్యా
- ↑ చ.వాత
- ↑ చ.శ్రీల ను
- ↑ చ.దగన్
- ↑ చ.బర్ప
- ↑ చ.నత
- ↑ చ.బ్రసరించు
- ↑ చ.విధు