[1]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [6-11]
ఉ. |
చాతకభాగ్యరేఖ జలజాతపరిచ్యుతి పక్వకందళీ
సూతి చికిత్సకాంగన ప్రసూనశరాసనరాజ్యలక్ష్మి ప్ర
ద్యోతనచంద్రమఃపటు[2]విధుంతుదభీషకసర్వజీవజీ
వాతువు గాననయ్యె [3]నవవారిధరోదయవేళ [4]యయ్యెడన్.
| 20
|
ఉ. |
క్రూరతటిత్కృపాణ[5]తతిరూఢబలాక[6]కపాలమాలికా
హారిణి నిర్నివారణవిహారిణి [7]కాళిక [8]కాళికాగతిన్
దారుణ[9]లీలమై భువనదాహకుఁడైన నిదాఘదైత్యు నం
భోరుహమిత్రు పేరి తలఁ బుచ్చుక మ్రింగె విచిత్రవైఖరిన్.
| 21
|
తే. |
వర్షధారలు పన్నగావళులు గాఁగ
బ్రబలు మెఱుపులు తన్మణిప్రభలు గాఁగ
భానుశుభ్రాంశుకాంతులు గాన రాక
యుండె రోదసి పాతాళమో యనంగ.
| 22
|
పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత
మ. |
లుఠితాశారవితాంతరంబు చపలాలోకప్రభాసంజ్ఞలున్
జఠరా[10]సహ్య[11]గిరాంవికారమును భూషావేషముం ధూర్తుక
ర్మఠవృత్తంబుగ దుర్దినావళి సుదూరస్ధంబు చేసె న్మహా
శఠముం బోలెఁ గుముద్వతీకమలినీచంద్రార్కలీలన్ [వెసన్.]
| 23
|
సీ. |
కలయంగ వనవాటికలఁ [12]జోడుముట్టుచు
కొండమ[ల్లియ] తావి గుబులుకొనియెఁ
బురివిచ్చి పంచమస్ఫుటనాదములతోడ
నర్తించి గిరులెక్కె [13]నమలిపిండు
దిశల నెఱ్ఱనిఛాయఁ దిలకింపఁగాఁ జేసెఁ
గణపమ్రాఁకుల కోరకముల సొబగు
విరహమానసములు వేగదొడఁగఁ జల్లి
[14]కఱ్ఱ గైకొనెఁ దూర్పుగంధవహుఁడు
|
|
తే. |
చెలగె నెడనెడ [15]నాభీలసలిలపూర
విహరణోద్దండమండూకవీతకంధ
|
|
- ↑ సుంకసాల
- ↑ చ.విధూత్తభిషేకము
- ↑ చ.నున
- ↑ చ.యంతయున్
- ↑ చ.పరి
- ↑ చ.కపోల
- ↑ చ.కారిక
- ↑ చ.కానికా
- ↑ చ.లీనమై
- ↑ చ.నమ్య
- ↑ చ.గిరిం
- ↑ బోదు ముట్టించు
- ↑ చ.నెమలి
- ↑ చ.కద్రు
- ↑ చ.నాపెలు