|
ధర ధనమూలవృద్ధులకుఁ దక్కక [1]సాగినవారిఁ గూర్చి య
క్కఱ [2]గుడి వ్రాసి యాఁగె ననఁగాఁ బరివేషము చుట్టె నాతనిన్.
| 15
|
మ. |
ఘనరావంబు చెలంగ భృంగి వినుతుల్ గావించి పాడంగఁ గా
ననమం దెచ్చట నీలకంఠవిలసన్నాట్యంబు రంజిల్లెఁ దా
[ఘనరావంబు చెలంగ భృంగి వినుతుల్ గావించి పాడంగఁ గా
ననమం దెచ్చట నీలకంఠవిలసన్నాట్యంబు రంజిల్లదే.]
| 16
|
చిమ్మపూడి అమరేశ్వరుఁడు - విక్రమసేనము
తే. |
అంబుదంబులు రత్నాకరంబు నీరు
దలఁచి పద్మరాగములతోఁ దలముఁ దప్ప
ద్రావి దక్కింపఁజాలక ధరణిమీఁద
గ్రక్కెనో యన సురగోపకములు వొలిచె.
| 17
|
భావన పెమ్మన - అనిరుద్ధచరిత
సీ. |
ఉల్లాసనర్తనోత్ఫుల్లవిభుక్షేత్ర
బర్హాతపత్రవిభాతి మెఱయ
శంపాలతాజాలసంపాదితోన్మీల
దాలోలనీరాజనాంశు లుదర
శాతమన్యవచాపజాతశోభాయత్న
బహురత్నతోరణప్రభలు నెఱయ
జటలీకృతాభోగపటలీసముత్తుంగ
[మాతంగ]ఘనఘటామహిమ దనర
|
|
తే. |
గ్రీష్ముశాత్రవుఁ డెంతయుఁ గ్రిందుపడఁగ
జటులగర్జాభయానకస్వనము లెసఁగ
జారుసలిలవిధాభిషేచనము లొదవఁ
బ్రావృడాగమరాజన్యపట్ట మమరె.
| 18
|
చ. |
లలితగతి న్మయూ[రికలు] లాస్య మొనర్పఁగ భేకదంపతీ
కలకల[3]నాదముల్ చెలఁగ గర్జనవాద్యము లుల్లసిల్లఁ గం
దలకు సుమాంజలుల్ [4]వెలయ నర్తనశాలయనం దనర్చె భూ
తలము విచిత్రవారిదవితానతిరస్కరిణీసమేతమై.
| 19
|
- ↑ చ.సారికి
- ↑ చ.గురి
- ↑ చ.సౌధముల్
- ↑ చ.చలగ