|
వారిపైఁ బొట్టలు వాచి తేలె
మృగతృష్ణనీళ్ళని మృగసంఘ మెదురేఁగి
నొగిలి నల్దెసలకు నోళ్ళు దెఱచె
నాకాశచరకోటి యాతపంబునఁ గ్రాఁగి
నింగి నిల్వఁగ లేక నేలఁ గూలె
|
|
తే. |
నింకె నదనదీకూపంబు లెండెఁ [1]జెఱువు
లుండలేరైరి నరులెల్ల నుబ్బచేత
గుంది పథికులు మ్రాఁకులక్రిందఁ బడిరి
కడు భయంబున వీవరి (?) గాడ్పు లెసఁగ.
|
|
చ. |
మృడు నయనాగ్నిఁ గ్రోలి హరు మేచకకంఠముమీఁద వ్రాలి య
జ్జడనిధి బాడబానలము చక్కటిఁ దేలి [2]దవప్రభూతముల్
తడఁబడి తోలి తేలి బెడిదంబగు వేఁడిమితోడ వచ్చె న
ప్పడమటిగాలి లోకముల ప్రాణుల జాలి నిదాఘవేళలన్.
| 12
|
వర్షఋతువు
పెద్దిరాజు – అలంకారము [3-103]
క. |
తటి[3]దటన మేఘపటలీ
ఘటితాంబర[4]శక్రచాపకరకా[5]వ్రాత
స్ఫుటధారాసాదాదివి
కటత నుతింపంగవలయు ఘన[6]కాలమునన్.
| 13
|
మ. |
చపలా[7]లోకములన్ బయోధరగరిష్ఠశ్రీయు [8]సద్యోల్లస
ద్విపులానందము నంబరాభరణసద్వేషంబునుం [గంకణ
స్థ][9]పుటారావము [10]సొంపు మీఱఁ దగు వర్షావేళ విశ్వేశ్వరా
[ధిపు] సేవించు ప్రగల్భకామినిగతిం [11]దీపించు [12]భావింపఁగన్.
| 14
|
[13]చరిగొండ ధర్మయ – చిత్రభారతము [2-16]
చ. |
కరములు చాఁపి [14]వడ్డిడుటకై బుధశుక్రుల సాక్షివెట్టి య
య్యరుణుఁడు భూమిచేతఁ దగ నప్పులు [15]గైకొని యియ్యకున్నచో
|
|
- ↑ చ.దరువు
- ↑ చ.దవిప్రభాతముల్
- ↑ చ.తటన
- ↑ చ.చక్ర
- ↑ చ.వాతా
- ↑ చ.కాయమునన్
- ↑ చ.లోలము
- ↑ చ.నన్నొ
- ↑ చ.కుటీలాపము
- ↑ చ.నొప్పు
- ↑ చ.దీపించి
- ↑ చ.భావించినన్
- ↑ చలికొండ
- ↑ చ.పట్టిడుటకై
- ↑ చ.పుచ్చుకొ