పుట:ప్రబంధరత్నాకరము.pdf/221

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తోఁచెఁ బ్రాచీమహీధరోత్తుంగసరణిఁ
బ్రాఁజదువు మానికంబుల [1]బరణి తరణి.

[2]అయ్యలార్యుఁడు – యుద్ధకాండశేషము [1812]

సీ.

ఘనతమిస్రో[3]న్మత్తకరిరక్తజలములఁ
              జెలువారఁ దోఁగిన సింహ మనఁగఁ
బూర్వపయోరాశి పొందున నుండుక
              వచ్చు బాడమహావహ్ని యనఁగఁ
బ్రథమాద్రిశృంగంబు పైదెచ్చి పెట్టిన
              ఘనపద్మరాగైకకలశ మనఁగఁ
బ్రాచీవధూకరపల్లవతలమునఁ
              గొమరారు విద్రుమగుచ్ఛ మనఁగ


తే.

భానుఁ డుదయించె రాఘవమానవాధి
పతిమనోరథ[4]పరిపక్వఫల మనంగ
భూరితేజంబు వెలుఁగంగ భువనభవన
తిమిరహతిఁ జేయఁ జాలిన దీప మనఁగ.

6

[?]

సీ.

దివసముఖాభినందితచక్రయుగ్మమం
              బుల యనురాగంపుఁబో వనంగ
హరిహరబ్రహ్మమహానుభావంబు లొ
              క్కటిగాఁగఁ గరఁగిన ఘటిక యనఁగ
నతులవేదత్రయలతికాచయము పెను
              పొందఁ బుట్టెడు మూలకంద మనఁగ
++ + + + + + + + ++ + + + +
              + + + + + + + + + + + + + +


తే.

నఖిలజగములు కట్టెఱ్ఱ యగుచు జనన
మాజకరపుటహృదయసరోజములకు
ముకుళనంబును జృంభణంబును నొనర్చి
భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగె.

7

శ్రీనాథుఁడు - భీమఖండము [2-49]

సీ.

ప్రథమసంధ్యాంగనాఫాలభాగంబునఁ
              జెలువారు సిందూరతిలక మనఁగఁ

  1. చ.భరణి
  2. అయిలన
  3. చ.ద్యత
  4. చ.తరుపక్వ