చతుర్థాశ్వాసము
క. |
శ్రీరమణీరమణీయకృ
పారాజదపారకలశపారావారా
చారుతరలోచనీకృత
నీరజవనమిత్రభేశ నీలాద్రీశా!
| 1
|
వ. |
దేవా! సూర్యోదయాదివర్ణనంబులు విన్నవించెద నాదరింపుము.
| 2
|
సూర్యోదయము
పెద్దిరాజు – అలంకారము [3-113]
క. |
[1]ఎచ్చటఁ జూచిన జగముల
నచ్చటనె వెలుంగు [2]నవియు నజహరిహర[3]తా
సచ్చతురుఁ డనియు మఱియును
నిచ్చకుఁ దగఁ బొగడవలయు నిను నుదయంబున్.
| 3
|
మ. |
కమలామోద మెలర్ప నేత్ర[4]సుఖదాకారంబు రంజిల్ల ను
త్తమవందారుశివంక[5]రత్వ మెసఁగన్ ధర్మార్థకామక్రియా
దిమ[6]మూలం బన [7]నొప్పు మిత్రుఁ [8]డుదయోత్సేకప్రభావంబుచే
సముఁ డద్దేవున కిందువంశజుఁడు త[9]చ్చంచద్గుణశ్రేణులన్.
| 4
|
ముక్కు తిమ్మన – పారిజాతము [4-49]
సీ. |
[10]మొగుడుఁదమ్ములఁ జిక్కు మగతేఁటియలుఁగులు
సడలిపోఁజేయు విశల్యకరణి
కాలవశంబునఁ గడసన్న వాసర
శ్రీఁ గ్రమ్మఱించు సంజీవకరణి
రే యను వాలునఁ [11]బాయలైన రథాంగ
తతుల హత్తించు సంధానకరణి
తిమిరంబుచే సొంపు సమసినదిశలకు
వన్నియ నొసఁగు సౌవర్ణకరణి
|
|
తే. |
మించు [12]బీఱెండ యగ్నిఁ బుట్టించు సరణి
కలుషఘోరపయోరాశిఁ [13]గడపు [14]తరణి
|
|
- ↑ చ.అచ్చట
- ↑ చ.ననియని
- ↑ చ.కాణచ్చరియుడని
- ↑ చ.సుకరా
- ↑ చ.రత్న
- ↑ చ.మూలంబున
- ↑ చ.నొప్ప
- ↑ చ.నుదయో
- ↑ చ.చంచెత
- ↑ చ.మొగులు
- ↑ చ.జాయ
- ↑ చ.నీరెండ
- ↑ చ.గుడుపు
- ↑ చ.సరగి