తే. |
గనియెఁ జిత్రంబునకు వీరి గలసియుండ
మనుపఁ జెఱుపంగఁ [1]జెఱుపంగ మనుప నేర్తు
రెల్ల లోకములకు దైవ మేకమగుట
హరిహరాత్మక మెఱిఁగితి మనిరి సురలు.
| 56
|
కవిలోకబ్రహ్మ - శివజ్ఞానదీపిక
సీ. |
బవరాన సూతుఁడై పార్థున కాతండు
నచ్చినాఁ డీతండు మెచ్చినాఁడు
చంచత్కృపాస్ఫూర్తిఁ బంచాస్త్రు నాతండు
పెంచినాఁ డీతండు నొంచినాఁడు
శేషపన్నగరాజు సెజ్జగా నాతండు
వ్రాల్చినాఁ డీతండు దాల్చినాఁడు
హాలాహలముఁ జూచి యల్లంత నాతండు
చెంగినాఁ డీతండు మ్రింగినాఁడు
|
|
తే. |
చక్రి యాతండు వసుమతిచక్రి యితఁడు
[2]సవనపరుఁ డాతఁ డీతండు హరణ[3]పరుఁడు
విశ్వమయుఁ డాతఁ డీతండు విశ్వనాథుఁ
డనుచు హరిహరనాథుల నభినుతింతు.
| 57
|
బ్రహ్మస్తుతి
[4]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము పీ. 2
చ. |
పొలయలుకన్ జపంబునకుఁ బూని కనుంగవ లెల్ల [5]మోడ్చియుం
దలపున మంత్రవర్ణమయతన్ గనుపట్టిన వాణిఁ జూచి న
వ్వొలయఁగఁ గౌఁగలించి [6]సుసుఖోన్నతిఁ జెందెడి విశ్వతోముఖం
డెలమిఁ దలిర్ప మత్కృతికి నీవుత విశ్వజనాభిముఖ్యమున్.
| 58
|
జయతరాజు ముమ్మయ - విష్ణుకథానిధానము
చ. |
వల పెటువంటిదో ముసలివాఁ డనవచ్చునె యద్దిరయ్య ప
ల్కుల జవరాలు దాఁ జదువులోన జపంబులలోనఁ బాయ ద
గ్గలముగ నెల్ల ప్రొద్దును మొగంబునఁ గట్టిన [7]యట్టులుంటు (నీ)
నలువకు నంచుఁ [8]గాముఁడన నవ్వు విధాత శుభంబు లీవుతన్.
| 59
|
- ↑ క.బెనుపంగ
- ↑ క.యవన
- ↑ క.వరుఁడు
- ↑ సుంకెసాల
- ↑ క.మోడ్చినన్
- ↑ క.ససుఖోన్నతి
- ↑ ట.యట్లయండు
- ↑ ట.గాముకులు