పుట:ప్రబంధరత్నాకరము.pdf/214

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామలింగన – హరిలీలావిలాసము

చ.

తెలతెలవాఱ నొయ్య నరుదెంచు నిశాంతరతాంతతాంతలౌ
చెలువల కింపుగా మెలఁగుఁ జెక్కులఁ గూరిన చూర్ణకుంతలా
వళి సదళంబుగా జడియు వాడిన సెజ్జలమీఁదఁ బ్రావిరుల్
దొలఁగఁగఁజేయు నూడిగపుఁదొయ్యలులం బలె వేఁగుఁదెమ్మెరల్.

238

జక్కన - సాహసాంకము [1-97]

సీ.

కమలాగృహకవాటకలితకుంచిక నాఁగ
              జలజకోరికరాజిఁ [1]గలయఁ దెఱచి
మధుకరాకర్షణమంత్రసిద్ధుఁడు నాఁగ
              కుసుమరజోభూతి దిశలఁ జల్లి
సుభగలతానటీసూత్రధారుఁడు నాఁగ
              నృత్యవిద్యాప్రౌఢి నెఱయ నేర్చి
సకలజీవోన్మేషసంజీవని యనంగఁ
              బ్రకటనిద్రాముద్రఁ బాయఁ జేసి


తే.

మందిరోద్యానవాటికలందుఁ బొలసి
వేఁగుఁబోఁకలఁ దత్పురి విశ్రమించు
శౌర్యమాంద్య[2]సౌరభ్యసాహిత్యమైన
మలయపర్వతసంజాతమారుతంబు.

239

తిక్కనసోమయాజి – ఉద్యోగపర్వము [2-112]

సీ.

పద్మరాగంబులు పరఁగించు నరుణోద
              యంబు కాంతికిఁ జెలువంబు మిగులఁ
బరువంబు దప్పిన విరులు రాలుచుఁ దరు
              చయము చుక్కలు లేని చదలఁ జెనయ
నరవిరినెత్తావి నడరించు నున్నిద్ర
              విటవీటిసౌరభవితతి వొదల
నెలఁత చీఱిన యెఱకల నెఱిఁదీర్చు జ
              క్కవలు చందోయి కేఁకట యొనర్ప


ఆ.

వెలరువాఱు దీవియల నార్చు నల్లన
సొరణగండ్లయందుఁ జొచ్చి సుడిసి
తిరిగి వేగుఁబోక తెమ్మెర లెలదీఁగ
కొనల వంక లొత్తు ననలఁ బ్రోచు.

240
  1. గ.గలయఁదెఱచి
  2. గ.సౌధత్వ