ఉ. |
చుక్కల నెయ్యపుందగవు సూచిన యామిని కూర్మిసూచినన్
జక్కన నాథు దీనతకుఁ జాలక మున్కడు నస్తమించె న
మ్మక్క! శిలావిశేషముగదా శశియశ్మము నీలరోచి గా
దొక్కొ కలంక నొల్లనని యోర్చెఁ దదీయవియోగదుఃఖమున్.
| 234
|
అరుణోదయము
మ. |
అరవిందప్రియవాది ఘోరతిమిరవ్యాళవ్రజస్ఫూర్తికిన్
గరుడుం డంచితదిక్సతీకుచతటీకాశ్మీరపంకంబు పు
ష్కరభాగా[1]టవికాగ్రపల్లవితమాకందంబు మందప్రభల్
బెరయం దూర్పునఁ [2]గుంటివేల్పు వొడసూపెన్ దపదండాకృతిన్.
| 235
|
శ్రీనాథుఁడు - కాశీఖండము [1-121]
సీ. |
చిఱుసానఁ బట్టించి చికిలి సేయించిన
గండ్రగొడ్డలి నిశాగహనలతకుఁ
గార్కొన్న నిబిడాంధకారధారాచ్ఛటా
సత్రవాటికి వీతిహోత్రజిహ్వ
నక్షత్రకుముదకాననము గిల్లెడు [3]బోటి
ప్రాచి యెత్తిన హస్తపల్లవాగ్ర
మరసి మింటికి మంటి కైక్యసందేహంబు
పరిహరింపఁగఁ బాల్పడ్డ యవధి
|
|
తే. |
సృష్టి [4]కందెర దొలుసంజ చెలిమికాఁడు
కుంటి వినతామహాదేవి కొండుకుఁగుఱ్ఱ
సవితృసారథి [5]కట్టెఱ్ఱ చాయఁ దేలు
నరుణుఁ డుదయించెఁ బ్రాగ్దిశాభ్యంతరమున.
| 236
|
వేఁగుఁదెమ్మెరలు
ముక్కు తిమ్మన – పారిజాతము [2-62]
మ. |
సమయాభీరకుమారుఁ డేపునఁ దమిస్రారూపనక్తంచరిం
గమలద్వేషణమండలీకుచగళత్కాంతిచ్ఛటాదుగ్ధపూ
రముతో రూపఱఁజేయ శోషిలుచుఁ దార ల్సోల నిట్టూర్పు సాం
ద్రముగా నూర్చె ననంగఁ బొల్పమరఁ బ్రాతఃకాల[6]వాతూలికల్.
| 237
|
- ↑ చ.టవిధా
- ↑ చ.గుంటు
- ↑ క.పొడి, గ.పాండి
- ↑ క.కంటెఱ్ఱ, గ.కంటెర్ర
- ↑ గ.సందెర్ర
- ↑ క.వాతూలముల్