పుట:ప్రబంధరత్నాకరము.pdf/210

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[?]

తే.

గాఢతరకాంతికై మ్రింగు కాంక్ష నంత
రిక్షకాపాలికుఁడు సంతరించినట్టి
గొప్ప యగు [1]సిద్ధపారదఘుటిక యనఁగ
జొక్కమగు కాంతి వేగురుఁజుక్క దనరె.

220

గంగాధరుఁడు – తపతీసంవరణము [3-105]

తే.

అత్రిమునికంటి పసిబిడ్డఁ డాకసమున
నుడుగణము లాడకాడకు [2]నొడ్డగిలిన
బాలభానుండు నలుగడఁ బర్వ [3]మింట
వెండిగుండన నుదయించె వేగుఁజుక్క.

221

కుక్కుటధ్వని

తులసి బసవయ్య - సావిత్రికథ

ఉ.

మాయపుఁదుంటవిల్తు వెడమాయలు మానినులార [4]ప్రాయముల్
వోయెడు నాఁడునాఁటి కిఁకఁబో విడుఁడీ యలుకల్ నిజేశులన్
బాయకుఁడీ యటంచుఁ బరిభాషలఁ జాటెడుభంగి కొక్కురో
కోయని కూఁత వేసెఁ దొలికోడి పురాంతరగేహదేహళిన్.

222

జక్కన - సాహసాంకము [6-73]

ఉ.

రాయిడికత్తెలైన పెనుఁబాయిడి యత్తలయిండ్లఁ [5]గోట్రముల్
సేయు విలాసినుల్ [6]మునుకు సెందఁగ వేశ్యలప్రక్క దాపులన్
బాయని కాముకుల్ వెలుకబాఱి కలంగఁగ మ్రోసెఁ గొక్కురో
కోయని కుక్కుటస్ఫుటదకుంఠితకంఠకఠోరనాదముల్.

223

పిల్లలమఱ్ఱి వీరన – శాకుంతలము [3-199]

ఉ.

తోయజపుష్పబాంధవుఁడు తూరుపుఁగొండకు రాదలంచె భూ
నాయకుఁడున్ శకుంతల మనం బలరన్ జనుదెంచుఁ దుమ్మెదల్
మ్రోయకుఁడీ శుకంబులు [7]నెలుంగులు సేయకుఁడీ పికంబులున్
గూయకుఁడీ ప్రమాదమని కూఁతలు చేసినభంగిఁ గొక్కెరో
కోయని బిట్టుమ్రోసెఁ దొలికోడి నికుంజకుటీరవాటికన్.

224
  1. క.చ.శుద్ధ
  2. క.నుండనువిన, గ.మాదవిడిన
  3. క.మీటి, చ.మీటు
  4. చ.ప్రాణముల్
  5. క.దో+ముల్, గ.కొండ్రముల్
  6. క.వినవుఁ జేడుగ
  7. క.గ.నిరుంగులు