|
ఫణికుండలంబును మణికుండలంబును
గండభాగంబునఁ గప్పుకొనఁగ
వరచక్రశూలాబ్జవరదహస్తములందుఁ
గంకణభుజగకంకణము లమరఁ
గనకకౌశేయంబు గజరాజచర్మంబు
మునుకొని కటి[1]భాగమున నటింప
|
|
తే. |
దిమిరమును జంద్రికయు జోక నమరినట్లు
పుండరీకోత్పలద్యుతుల్ [2]పొదలినట్లు
నీలవజ్రంబు లొకచోట నిలిచినట్లు
హరిహరాకృతి త్రిభువనానంద మయ్యె.
| 54
|
జయతరాజు ముమ్మన - విష్ణుకథానిధానము
సీ. |
లసదురఃస్థలంబునఁ బసనైన గళమున
విలసితలీల శ్రీ నిలిపినారు
చరణంబు పట్టున జడలలో చుట్టున
ననువొందఁ[3]గా గంగ నునిచినారు
భవ్యగుణంబున దివ్యదేహంబున
నొఱపు మీఱఁగ భూతి [4]నొఱసినారు
తిరముగా మూఁపునఁ గరమొప్ప రూపునఁ
బొలుపొందఁగా ధాత్రిఁ బూనినారు
|
|
తే. |
తెల్ల గలయిండ్ల నిలిచి వర్తిల్లినారు
ఇరువు రిరువుర భార్యల నేలినారు
పెక్కుమొగముల కొడుకులఁ బెనిచినారు
హరిహరులు వీరు సర్వలోకాధిపతులు.
| 55
|
నాచిరాజు సోమన – ఉత్తరహరివంశము [2-181]
సీ. |
సారసంబున [5]లేవ నీరసంబునఁ [6]జావ
పద్మాసనుఁడు వీరి పాలఁగనియె
రూపు గంటఁ జెలంగఁ జూపు మంట నలంగఁ
బంచబాణుఁడు వీరి పాలఁగనియె
వరములు వడయంగ శిరములు గెడయంగఁ
బంఙ్క్తికంఠుఁడు వీరి పాలఁగనియె
గేహరక్ష నటింప దేహశిక్ష ఘటింప
బాణాసురుఁడు వీరి పాలఁగనియెఁ
|
|
- ↑ క.భారమున
- ↑ క.పొదరి, ట.పొదివి
- ↑ క.గంగను నిలిపినారు
- ↑ ట.మెఱసి
- ↑ క. లెద
- ↑ క. బోవ