|
దట్టముగ నంతకంతకుఁ దనరి తనరి
[1]యిట్టలంబుగ వెన్నెల నిట్ట వొడిచె.
| 205
|
[2]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-135]
సీ. |
పయి సుధారోచితబింబము తక్రమునయందు
మునిఁగి తేలెడు వెన్నముద్ద గాఁగ
మహి విశ్రమించు దంపతులు పాల్కడలిలో
భాసిల్లు దివ్యదంపతులు గాఁగ
నింగి నాడు చకోరనివహంబు [3]మిన్నేటఁ
గలయ [4]నీదెడు నంచకొలము గాఁగ
దెసలఁ గైరవసముత్థితపరాగము వజ్ర
మయశైలతటులపై మంచు గాఁగ
|
|
ఆ. |
మీఁదఁ దొట్టి క్రింద మిక్కుటంబై యంత
రాళమెల్ల నిబ్బరముగ ముంచి
యెల్లకడలయందు మొల్లమై పండువె
న్నెల జగంబు కుక్షి [5]నిండి వెలిగె.
| 206
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-47]
మ. |
అమృతం బాసవ మంగరాగ ముదయోద్యత్కాంతి చేలంబు చి
హ్నమునుంగా శశిరేవతీరమణుఁ డున్మాదంబు మీఱం దమో
యమున న్భంగమునొంది పాఱఁ గరసీరాలోడితం జేయ వ
చ్చె మరుద్వాహిని దానిఁ దేర్ప నన మించెం జంద్రికాపూరముల్.
| 207
|
సీ. |
తళుకు సుప్పాణి + + + + మించిన
మెఱయు చుక్కల మేని మెఱుఁగు దరమి
కలికి రాయంచ ఱెక్కల ఠేవ గిలుమాడి
విరిమల్లె గుత్తుల మురువుఁ దెగడి
చదువుఁదొయ్యలి మేని చాయ నుల్లసమాడి
తె + + + + తెలివి గెలిచి
జిగిమీఱి తొగరేకు సిరులకు నన విచ్చి
పాపరాయని వన్నె క్రేపు చూపి
|
|
తే. |
పాల మున్నీటి తరఁగల పసల నవ్వి
కొండయల్లుని మైతెల్పు కొంచె పఱిచి
కుప్ప తిలజులు + + + గొనలు సాగి
వెలఁదివెన్నెల లెల్లెడ వెల్లివిరిసె.
| 208
|
- ↑ క.యిట్టులుబ్బగు, గ.యిద్దిలంబుగ
- ↑ సుంకెసాల
- ↑ గ.మువ్వన్నె
- ↑ క.గ.నిండేడు
- ↑ క.గ.నిలిపి