శ్రీనాథుఁడు - వల్లభాభ్యుదయము
సీ. |
రజనీవధూకర్ణరజతతాటంకంబు
వలరాజుధవళోష్ణవారణంబు
ప్రోషితయువతిహృత్పుటభేదదాత్రంబు
బహుచకోరకుటుంబపానపాత్ర
మధుకైటభాసురమథను దాఁపటికన్ను
చక్రవాకంబుల చల్లజంపు
దుగ్ధపాథోరాశి తొలిచూలి సంతతి
రోహిణీదేవితారుణ్యఫలము
|
|
తే. |
చంద్రకాంతశిలా[1]మణిస్థలకృపీట
నిర్థ[2]రాదోవ్యథామోక్షనియమవైద్యుఁ
డంధకారచ్ఛటాహాలహల[3]హరుండు
చంద్రుఁ డొప్పారెఁ గాంతినిస్తంద్రుఁ డగుచు.
| 199
|
చంద్రునిలో మచ్చ
[4]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-132]
క. |
[5]ప్రమథపతిమూర్తిచంద్రుఁడు
తిమిరగజాసురు నణంచి తిత్తొలచిన త
త్యమధిక చర్మముఁ దాల్చిన
క్రమమున నంకంబు గడుఁ బ్రకాశితమయ్యెన్.
| 200
|
శ్రీనాథుఁడు – భీమఖండము [2-45]
సీ. |
రోహిణీగాఢోపగూహనంబునఁ గన్న
కస్తూరికాస్థానకం బనంగ
రాహుదంష్ట్రాఘాతరంధ్రమార్గంబున
లలిఁ దోఁచు నాకాశలవ మనంగ
నైర్మల్యమునఁ [6]జేసి నడుమఁ గానఁగ వచ్చు
కమిచి మ్రింగిన యంధకార మనఁగ
జన్మ[7]వేళను మంథశైలాభిఘట్టన
సంభవించిన కిణస్థాన మనఁగ
|
|
తే. |
విరహపరితాపభరమున వేఁగుచున్న
చక్రవాకాంగనల కటాక్షముల యగ్గి
|
|
- ↑ క.నునికరకృపిట, చ.నునిలకృపీట?
- ↑ క.రాంభ లామోక్ష, గ.రాంబుధిమోక్షక
- ↑ గ.ధరుండు
- ↑ సుంకిసాల
- ↑ క.గ.ప్రమదాతి
- ↑ క.గ.దోచు
- ↑ క.గ.కాలము