|
యుత్తమాంగమునందు నొఱవుఁ జూప
గండ[1]పెండేరంబు కలితమంజీరంబు
పాదపద్మములందుఁ [2]బ్రతిఘటింప
|
|
తే. |
నర్ధనారీశ్వరస్వామియై తనర్చు
దక్షపురభీమలింగంబు దయ పొసంగ
నర్థి గల నాకుఁ బ్రత్యక్షమైనఁ జూచి
మోద మిగురొత్తఁ బాదాబ్జములకు మ్రొక్కి.
| 51
|
ఎలుపర్తి రామరాజు - రామలింగశతకము
సీ. |
గంగాప్రవాహంబు కన్నెగేదఁగిఱేకు
నమృతాంశురేఖ ముత్యాలసేస
యురగేంద్రహారంబు కురువిందములపేరు
విసము కప్పురముతో వీడియంబు
ప్రాఁత కంకటి కాలు పంకసంజాతంబు
జింకపిల్లయు రాచచిలుక బోద
యిభచర్మచేలంబు యింద్రగోపపుఁ బట్టు
భూతిపుంజము నవ్యపుష్పరజము
|
|
తే. |
హేమ[3]గోత్రకోదండంబు నిక్షుధనువు
గలుగు నర్థనారీశ్వరాకారమునను
భువనజాలంబు భక్తులఁ బ్రోవుమయ్య
రాజహంసరథాంగ! శ్రీరామలింగ!
| 52
|
ఉ. |
పామును హారము న్నెలయుఁబాపట సేసయు నేరు మల్లికా
దామము తోలుదువ్వలువ దట్టపుభూతియుఁ జందనంబు మై
సామున జాలు నందముగ సన్నిధి చేసినఁ జూడఁగంటి నే
నా మదిలోఁ [4]గుమారగిరినాథుని శైలసుతాధినాథునిన్.
| 53
|
హరిహరము
హరిభట్టు – ఉత్తర నరసింహపురాణము
సీ. |
మందారకుసుమంబుఁ జందురుండును గూడి
మౌళిభాగంబునఁ గీలుకొనఁగ
|
|
- ↑ క.పెండెరమున
- ↑ క.ప్రభ
- ↑ క.గొల్పు
- ↑ క.గొమార