పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు – జైమిని భారతము [3-28]
[1]చ. |
[2]ఒఱపరిఁ గన్న గూడఁ జను నొయ్యన సన్నలువాఱ నాడుఁ ద
త్తఱపడు బోఁటి [3]బిల్చెడువిధంబున నొత్తిలి పల్కు నవ్వుఁ బ
ల్మఱుఁ బొరుగింటి కేగు నొకమట్టున నిల్వదు చంటిమీఁది [4]ముం
జెఱఁ గెడలించు వైశికపుసిగ్గు నటించును జార ధారుణిన్.
| 174
|
[5]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-107]
[6]సీ. |
శ్రవణయోగ్యంబైన శబ్దమొక్కఁడు లేక
ప్రియము గొల్పెడు [7]నలంక్రియలు లేక
సరసమై మృదులైన శయ్య గల్గుట లేక
యర్థసంగ్రహముపై నర్థి లేక
వరుఁడు వట్టినచోటఁ బ్రత్యుత్తరము లేక
ప్రాణహానికిఁ గొంకుపాటు లేక
వర్ణ[గౌరవ]లాఘవములపై మతి లేక
[8]వృత్తభంగమునకు వెఱపు లేక
|
|
తే. |
తారుదారయ తక్క నెవ్వారు నొరులు
దడవ రొకమూలఁ బడి ప్రసిద్ధములు గాక
యపుడ విద్వత్ప్రబంధంబు ననుకరించె
జారిణీజారనవరహస్సంగమములు.
| 175
|
ఉ. |
కోటలు బొమ్మరిండ్లు మఱి కొండలు తాపలు దివ్యదృష్టికిన్
గాటుక లంధకారముగాఁ జని కందువపట్లఁ బాంసులా
పాటలగంధు లొంది రుపభర్తలతో మణితాదులైన జం
ఝాటము లేని కూటముల సాహస[9]కల్పలతాఫలంబులన్.
| 176
|
చ. |
కులసతి శిష్టమార్గమునకున్ మది నిల్చిన దాఁటరామికిన్
గులము మహాంబురాశి పతి కొండ గృహాంగణ మంధకూప మా
కులసతి దుష్టమార్గమునకున్ మది నిల్చిన యేని దాఁటఁగాఁ
గుల మొకగోష్పదంబు పతి గుండు గృహాంగణ మాటపట్టగున్.
| 177
|
- ↑ క.లో లేదు.
- ↑ గ.దొరపరిగొన్న
- ↑ గ.జేరెడు
- ↑ గ.ముచ్చెర
- ↑ సుంకిసాల
- ↑ క.లో లేదు.
- ↑ గ.నయు
- ↑ గ.నృత్త
- ↑ గ.గుల్మ