పుట:ప్రబంధరత్నాకరము.pdf/194

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

రజతగిరియందుఁ దాండవారంభరభస
భంగిపతిత[1]పరశ్వథపాణివికట
కంధరా[2]రుద్ధగజ[3]కృత్తికంథశంక
ప్రమథులకుఁ దోఁప నంధకారంబు ప్రబలె.

164

ముక్కు తిమ్మన – పారిజాతము [2-34]

సీ.

దినవారరాశి మాపను మౌని గ్రోలంగ
              నడుగునఁ గనుపట్టు నస లనంగఁ
గ్రుంకు[4]మెట్టడవిఁ [5]గార్కొనిన సంధ్యావహ్నిఁ
              [6]బొడమిన దట్టంపుఁబొగ యనంగఁ
దన మణి పడిపోవ ధరణీతలంబున
              నెమకంగ వచ్చిన నింగి యనఁగ
నల చుక్కలనియెడి వలరాజు గెలుపువ్రా
              [7]ల్దెలియఁ [8]బూసిన మషీలేప మనఁగ


తే.

[9]వృద్ధవారవిలాసినీవిసరమునకు
నపలితంకరణౌషధం బనఁగ జార
నలినముఖుల కదృశ్యాంజనం బనంగ
నంధకారంబు [10]జగమెల్ల నాక్రమించె.

165

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదము [4-124]

[11]సీ.

గగన[12]పల్వలసముత్కటమహాపంకంబు
              నందుఁ ద్రుళ్ళెడు లులాయం బనంగ
రజనీవధూటి తారకహారశోభకై
              [13]రమణఁ దాల్చిన నీలిరవికె యనఁగ
బ్రహ్మాండపటుకర్పరమున నర్కానలా
              ర్చుల నుద్భవించు కజ్జల మనంగఁ
గాలధాత్రీధరాగ్రమునందు నిబిడమై
              కనుపట్టు నీలమేఘం బనంగ


తే.

నంధకాసురగర్వాపహరణకంఠ
ఘటితహాలహలప్రభ [14]గగనరేఖ
[15]బలిమి జగమంతయును [16]నింత బలసె ననఁగ
నంధకారంబు [17]జగమెల్ల నాక్రమించె.

166
  1. క.స్వ+oకణ, గ.పశ్వభుండన
  2. క.గ.గంధ
  3. క.గ.వృత్తి
  4. క.మేటడవి, గ.పెట్టెడివి
  5. గ.గాల్గొనిన
  6. గ.బొదవిన
  7. గ.దివియ
  8. క.బూనిన
  9. క.పెద్దవారి
  10. గ.దిశలెల్ల
  11. క-లో లేదు.
  12. గ.పల్లవ
  13. గ.రవణ
  14. గ.గర్వ
  15. గ.లలమి
  16. గ.నిండ
  17. గ.దిశలెల్ల