పుట:ప్రబంధరత్నాకరము.pdf/193

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వులు చెలియా మదీశుని కవుంగిలి డాయుడు నాకు [1]వల్పురే
ల్దొలఁగు టెఱుంగబోలు నట తోఁపవు మీఁద రతిప్రయోగముల్.

161

చీఁకటి

[?]

[2]ఉ.

పాయని వేడ్కలై చెలువ పంకజబాంధవ బింబదీపమున్
పాయఁగఁ దీసి యెంతయు నభంబను మూకిట నించు కజ్జలం
బాయెడ భూమిపాత్రికకు నల్లనఁ జార్చె ననం దమిస్ర మ
త్యాయతనీలిమోన్నతుల నందె మహీగగనాంతరంబునన్.

162

[3]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-91]

సీ.

కరచి చిప్పలఁబట్టు కత లెఱుంగము గాక
              వ్రాయంగ నిది మషీరసము గాదె
యిది కణంబులు సేయు నిర వెఱుంగము గాక
              నీలాల సరులు గావింప రాదె
కరవటంబులఁ బెట్టు వెర వెఱుంగము గాక
              వనితల కిది నవాంజనము గాదె
కడవలఁ గొని ముంచు గతి యెఱుంగము గాక
              చేలల కిది మంచి నీలి గాదె


తే.

పోవఁడే నిది రవినైనఁ బొదువుఁ గాదె
యంకమను పేర నురముపై నచ్చు దాల్చుఁ
గాక శశినైన నిది మ్రింగఁ గాదె యనఁగఁ
బ్రబలమై గాఢతమతమఃపటలి పర్వె.

163

శ్రీనాథుఁడు - భీమఖండము [2-35]

సీ.

గిరినికుంజములఁ గుంజరపుంజమను శంకఁ
              గంఠీరవంబు లుత్కంఠ నెగయఁ
[4]బల్వలంబులఁ [5]గిరిప్రకరంబులను శంక
              నెఱుకురాజులు విండు లెక్కు [6]వెట్టఁ
గడలి మధ్యంబునఁ గాకోలమను శంక
              జలదేవతలు భీతి సంభ్రమింప
నదులలోఁ గువలకాననవాటమను శంక
              నిందిందిరశ్రేణు లెదురుకొనఁగ

  1. గ.హోరుధీ
  2. ఈ పద్యము కవికర్ణరసాయనములోనిదని తంజావూరిప్రతియందు కలదు. కాని కవికర్ణరసాయనమునందు కానరాదు. ఇది ప్రత్యంతరమునందు లేదు.
  3. సుంకి
  4. గ.వలువలంబులు
  5. క.గిట్టి, గ.గీటి
  6. క.గ.లిడగ