పుట:ప్రబంధరత్నాకరము.pdf/192

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్కోమలపాదపద్మములకున్ దగుఁగాక మదీయసేవ యే
యే మదిరాయతేక్షణల యిండ్లకు నింతని డాసినాఁడవో.

156

కూర్మి

[1]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-144]

[2]ఉ.

ద్రోహము లేనిచోట [3]విభుఁ ద్రోచిన ద్రోహఫలంబు [4]గాదె ని
న్నీ హరిణాంకుఁ డింత [5]యెరియించుట వెన్నెల కోర్చునంత నే
సాహసి [6]నెట్లు నాయెడఁ బ్రసన్నకృపామతివై లఘుత్వసం
దేహము [7]లేక వల్లభునిఁ దెచ్చు విదగ్ధవు నీవు నెచ్చెలీ!

157

[4-145]

[8]చ.

ఎడ[9]వడు మాటలేల చని యేన ముఖాముఖిఁ బిల్తుఁ బిల్వఁగా
నొడఁబడి రాఁడయే నతని కొప్పన సేయుదుఁ బ్రాణమన్న నీ
నడుమన నన్ను [10]జీవముఁ గొనం దలకొన్నది యో [11]వయస్య యీ
విడువని [12]వేలమై కురియు వెన్నెల చిచ్చున కేమి సేయుదున్.

158

[4-147]

[13]చ.

తడయుట కోర్వలేక యొకతన్వి మనఃపరికల్పనంబుచే
నెడ[14]పక వల్లభుం డెదుటి కేర్పడ వచ్చినయట్ల తోఁపఁగా
[15]నుడుగని కోర్కులం బొరలుచుండి యతం డ[16]రుదేఱఁ గాంచియున్
[17]దడియకయుండు నెప్పటివిధంబునఁ గౌఁగిటఁ జేర్చు నంతకున్.

159

కళావిలాసము

చ.

తొడవులు పెట్టి సంభ్రమముతోఁ దిలకించు మడుంగుఁ గట్టుఁ బై
బడుఁ [18]దడవోర్చుఁ దెం పెఱిఁగి పట్టదు నేర్పులు గట్టి పెట్టుఁ బ
ల్కెడునెడఁ దొట్రుపా టొదవుఁ గింకకు [19]బెగ్గిలమై చెమర్పఁగా
జిడుముడిఁ బొందుఁ గాంత పతిఁ జేరిన కూరిమి గల్గెనేనియున్.

160

భాస్కరుఁడు – శృంగారరత్నాకరము

[రసాలంకారము?]
చ.

లలనలుఁ గొంద ఱాత్మవరులన్ దమకూడిన చెయ్వు లన్నియున్
దలఁచి సఖీజనంబులకుఁ దప్పక చెప్పెడువారు [20]పుణ్యజీ

  1. సుంకిసాల
  2. క.లో లేదు.
  3. గ.విటు
  4. గ.దేన
  5. గ.యెదిరించుట
  6. గ.యంత
  7. గ.దేక
  8. క.లో లేదు.
  9. గ.యెడ
  10. గ.జేరుము
  11. గ.గ వైశ్య
  12. గ.యేల
  13. ఈపద్యము "పొరలుచుండి"వఱకు తంజావూరిప్రతియందు లేదు.
  14. గ.నెడ
  15. గ.నడిగిన
  16. గ.నుదెచ్చు దంచయున్
  17. క.గ.దడవక
  18. క.దడవోప దా పెరిగి, చ.దడవోప దా పెఱిఁగి
  19. క.బేగిలు, చ.బెంగిలు
  20. గ.వారు