|
తన మూర్తి నొకట రథంబు సేసి
కనుదోయిఁ జక్రయుగ్మముగ యోజన సేసి
సమత నూరుపుల నశ్వములఁ జేసి
|
|
తే. |
యన్నియును నీ యధీనంబు లగుటఁ జేసి
పురము లేసితిగాక నీ కొరులు తోడె
వేల్పు లెవ్వరు నీ సాటి విజయవాటి
మల్లికార్జునలింగ! యుమాప్రసంగ!
| 48
|
సీ. |
కాంతులఁ జూపట్టు కండ్లమరించిన
తిరమైన విపులపుఁ దేరునందు
విద్యల [1]ప్రోడయౌ వృద్ధసారథి నిల్పి
యతఁడు శిక్షించు హయములఁ బన్ని
[2]వన్నెవాసుల మించు తిన్నని [3]రావిల్లు
చొక్కు[టఁ] బై నారి నెక్కువెట్టి
గఱితోడఁ గూడ నాకసపుఁ [4]బ్రసూతి నీ
ళ్ళమ్మొనఁ బదనిచ్చు నమ్ముఁ దొడిగి
|
|
తే. |
యమరభటు లార్వ దైత్యపురములు గెడపి
విజయ మొందిన జోద వీ విశ్వమునను
వేల్పు లెవ్వరు నీ సాటి విజయవాటి
మల్లికార్జునలింగ! యుమాప్రసంగ!
| 49
|
చ. |
అదలని తేరు తేరునకు నాదరువై[5] తగు విల్లు వింటికిన్
గుదురగు నారి నారిపయిఁ [6]గున్కు శరంబు శరంబు బొడ్డునన్
బొదలిన యంత యంత ముఖముల్ నిజవాసములైన గుఱ్ఱముల్
చెదరక నీకు [7]నెట్లు పనిసేయునయా! [8]గిరిజేశనాయకా!
| 50
|
అర్ధనారీశ్వరము
ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత [1-29]
సీ. |
పులితోలు [9]రెంటెంబు వెలిపట్టు [10]గెంటెంబుఁ
గటిమండలంబున గరిమఁ దనర
భసితాంగరాగంబు బహుగంధయోగంబు
బాహుమధ్యంబునఁ బరిఢవింప
శీతాంశునవకాంతి సేమంతి పూబంతి
|
|
- ↑ ట. ప్రోఁక
- ↑ ట. తన్నివాసుల
- ↑ ట. ప్రావిల్లు
- ↑ ట. నూటిని బాగు నెమ్మేనుఁ బస నిచ్చు
- ↑ క. వైన
- ↑ ట. గూన్కు
- ↑ ట. నెట్టి
- ↑ క. శిరికేశ, ట. గిరిజాధి
- ↑ క. రెట్టంబు
- ↑ క. గిట్టంబు