తే. |
గణికవలని దెంత ఘనమైన సుఖమేని
దాని తల్లివలనఁ దప్పిపోవు
మదిఁ దలంప నెట్టి మధురాన్నమేనియు
నీఁగ దొరలెనేని నించుటెట్లు.
| 124
|
సీ. |
భావజు విడిచిన పాడింటిపై [1]బొల్లి
[2]పాదొట్టు గతి మేనఁ బలిత మొదవ
[3]నం టుండకుండఁ బ్రాయము దుల్పుకొను మాడ్కి
పడు చన్ను లేచి చప్పటులు జఱవ
ననుభవేచ్ఛావిలాసాదులఁ దిగిచిన
[4]కొఱ్ఱు నాఁ జేయూఁత కోల యూఁది
యుండుట కష్టమే నొల్లమే నను నట్లు
పలుమాఱు విడువక పడఁతి పడఁక
|
|
ఆ. |
నున్న లంజతల్లిఁ గన్నచో సల్లుర
గుండె భగ్గురనుచు నుండదెట్లు
తేరి చూడ వెఱచి చేరదు మృత్యువు
దానఁ గాదె చావు దప్పి మనుట.
| 125
|
చ. |
చదురులు దేవహేతువులు సాయలు మాయలు కోరదంబు లె
ల్లిదములు గానము ల్కపటలీలలు దాలలు తీపు లోపికల్
పదరులు వేనడు ల్బహువిళంబము లాసలు రచ్చమెచ్చులున్
పొడవుగఁ గూడియున్న పెనుబొల్లలు లంజలతల్లు లెల్లడన్.
| 126
|
భద్రదత్తకూచిమారపాంచాలురు
[5]సంకుసాల సింగయ - కళావిలాసము
[6]ఉ. |
బాలలరూపు చూపుకొని భద్రుఁడు మాటల బెండువెట్టి పాం
చాలుఁడు వశ్యమంత్రజపసాధ్యచయంబులఁ గూచిమారుఁ డా
భీలధనాంబరావళులఁ బ్రీతులుఁ జేయుచు దత్తమండలీ
లాలలితానురాగరతులన్ సుఖియింతు రనంగసౌఖ్యముల్.
| 127
|
[7]ఉ. |
ఇచ్ఛ యెఱుంగఁ డెట్టి ధన మీఁ డదె యూరక కన్నులార్చి మై
బచ్చునఁ జూపి కూర్పుమని పట్టిన నెట్టునఁ గూర్పవచ్చుఁ గ
న్నిచ్చలఁ బాఱి నెమ్మనము లిత్తురె మానినులెల్ల నొల్లనా
మెచ్చలు గావు భద్రు వెలి మిన్నక నవ్వులు కప్పుఁ బ్రెవ్వులున్.
| 128
|
[8]ఆ. |
ఈఁగి మిగుల నిచ్చు టెఱిఁగి యింపెఱుఁగదు
తన సుఖంబె కోరి పెనఁగుఁ గాని
|
|
- ↑ క.చల్లి, గ.పొల్లి
- ↑ క.పాదురు, గ.పాదుంట్రి
- ↑ క.నంటుకుండ, గ.నట్టింటికూడ
- ↑ క.కోరనా, గ.కొద్రనా
- ↑ సుంకసాల
- ↑ క.లో లేదు.
- ↑ క.లో లేదు.
- ↑ క.లో లేదు.