పుట:ప్రబంధరత్నాకరము.pdf/180

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


              బొలఁతు కదియెనె యూర్పోక కూర్మి
తగిలినచో నెల్లఁ దహతహ నొందె నే
              బోటికి నది యలదాఁటి కూర్మి
తన కట్ల కెలనికిఁ దన మేలు చూఁపునే
              జేడియ కదియు వైశికపుఁ గూర్మి


తే.

తనదు పైత్యభ్రమంబున ధరయుఁ దిరిగి
నట్ల యగు భంగి విటుని మోహమునఁ దోఁచు
గాన నిక్కింపుఁ గూరిమి గణికయందుఁ
బొరయ దిలఁ [1]బొరసిన నది తెరువు [2]పెసర.

[4-116]

[3]ఉ.

ఒక్కని విన్నదాఁక మఱియొక్కనిపైఁ దలఁపైనదాఁక వే
ఱొక్కనిఁ గన్నదాఁకఁ దను నొక్కఁడు పైకొని సోకుదాఁక నొం
డొక్కనిఁ దక్కు చూసి తగు లూడ్చెడు నంతటిదాఁక మిండచే
రొక్కము చెల్లుదాఁకనె సరోరుహలోచనలందుఁ గూరుముల్.

117

ఎఱ్ఱాప్రగడ – మలహణకథ [2-18]

[4]చ.

బలపము లేఁతనవ్వు నునుఁబయ్యెద సన్నపుఁగావిచీర మిం
చులు గొను జల్లజంపు నునుఁజూడ్కియె కన్నపుఁగత్తి మోవి తీ
పలవడఁ జొక్కుమందగ విటావలి డెందముఁ గన్నపెట్టి యిం
పల ధనమెల్ల దోఁచుకొని పోవలెఁ గామిని గండిదొంగయై.

118

కుటిలవేశ్య లక్షణము

[5]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-94]

సీ.

మడమలు [6]మోవంగ మైలచీరలు గట్టి
              కర్ణముల్ [7]మోవంగఁ గాటు కిడియు
మోచేతి పట్టులు మోవ గాజులు దొడ్గి
              యలికముల్ మోవఁ గొప్పులు ఘటించి
వెడలి గద్దువ మోవ విడియంబులు చేసి
              కాంక్షఁ జెంపలు మోవ గంధ మలఁది
చెక్కిళ్ళు మోవంగఁ జెవుల నాకులు వెట్టి
              బొమలు మోవఁగఁ జుక్కబొట్టు దీర్చి


తే.

భావభవు చేతి విడివాటు బడియ ద్రుడ్లు
సంజ ప్రొద్దునఁ బలు పిశాచములు వోలె

  1. గ.బొరసెనె
  2. క.గ.పెసరు
  3. క.లో లేదు.
  4. క.లో లేదు.
  5. సుంకసాల
  6. క.పెనుబటి, గ.బలుబట్టి
  7. క.కుటి, గ.గుట్టి, ము.గట్టి