పుట:ప్రబంధరత్నాకరము.pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాలపర్తి సోమేశ్వరుఁడు

సీ.

వింటి క్రిందటి కొమ్ముఁ [1]బెకలించి పెరికిన
              భూకాంతకును నాభి పొలుపు మిగిలె
నమ్ము పుచ్చు[2]కొనిన నమితతరంగ[3]మై
                             పాల[4]సముద్రంబు ప్రజ్వరిల్లె
బండికండులు రెండుఁ బండ్లిగిలించినఁ
              గలువలు దామరల్ సెలిమిఁ జేసె
వాజులఁ గొనివచ్చి వరరథంబున బూన్పఁ
              జిచ్చుకు నాకలి చిచ్చు పుట్టె


తే.

నారి సంధింపఁ గశ్యపనారి వణఁకెఁ
[గోల] సంధింప లచ్చికి [5]జాలి పుట్టె
విల్లుఁ దెగఁబాపి పురములు ద్రెళ్ళ నేసి
తరిది విలుకాఁడ వౌదువో శరభలింగ!

46

బొడ్డపాటి పేరయ - చాటువులు

సీ.

ఖండఖండంబునఁ గదిసిన [6]తేరున
              భంగంపుటిరుసు పొసంగఁగూర్చి
విజ్జోడువడి నిచ్చ వినువీథిఁ దిరిగెడు
              చక్రంబు లొనగూడ సంఘటించి
తలకొన్న భీతిఁ గొందలపడు బహుముఖ
              [7]భ్రాంతసారథి నేరుపరిగ నిలిపి
పలుకఁ బదక్రమంబుల నలుజాడలఁ!
              బోయెడి [8]గుఱ్ఱాలఁ బూనుకొలిపి


తే.

కుంటి వింటను బలువంక కోలఁ దొడిగి
విషమలక్ష్యంబు లే గతి వేసితయ్య
వేల్పు లెవ్వరు నీ సాటి విజయవాటి
మల్లికార్జునలింగ! యుమాప్రసంగ!

47


సీ.

బంట్లున్న పాలెంబు బలువిల్లుగాఁ జేసి
              నవమణి వలయంబు నారి సేసి
నుదుటి నెన్నడిమికన్నును ముల్కిగాఁ జేసి
              దక్షిణాంగంబె యస్త్రంబు సేసి
చేకొఱతల వాని జోక సారథి సేసి

  1. ట. వికలించి
  2. ట. కొనగ
  3. ట. ముల్
  4. ట. సంద్రంబున
  5. ట. గోల
  6. ట. తేరును
  7. ట. భ్రాంతి
  8. ట. గుఱ్ఱముల్