వారికివిటుఁడు
[1]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-98]
[2]ఉ. |
ఒత్తిలి రిత్త పైకొనుచు నొంటన రెంటన నిద్రపుచ్చుచున్
మెత్తన లేచి దీపము శమింపఁగఁజేసి [శ]యింపఁ బ్రక్కలన్
దొత్తులఁ బెట్టి వచ్చి తమ తొల్లిటి మిండలఁ గూడికొంచు నో
ర్మొత్తిరి క్రొత్త రో యిడిన [3]మొప్పెల గద్దఱి లంజ లయ్యెడన్.
| 113
|
[4]చ. |
ముడిఁగి ముసుంగుతో వెనుక ముందును జూడక వచ్చి లోనికిన్
దొడుకునఁ బోయి వ్రేల్మిడిన [5]ద్రొబ్బినఁ బెంపునకున్ బసిండికిన్
జెడితముఁ దార [6]తిట్టుకొని చీయని కేలు [7]విదిర్చి రోయుచున్
గుడిసెల దూరి వెల్వడిరి క్రొత్తగు సిగ్గరి మిండ లయ్యెడన్.
| 114
|
[8]సీ. |
పథికులఁ గని తానుఁ బథికుఁడై యొక కొంత
నడచి ముందఱి వారి నడచి మరులు
వరములు దయసేయ వలరాచ దేవర
వల గొను గతిఁ జుట్టి వచ్చు [9]నిల్లు
లోలతఁ జెవి యొగ్గి లోని చప్పుళ్ళకు
డిల్లమై యొగి నిగిడించు నూర్పు
కడయింట నత్త మేల్కని బిట్టు దగ్గిన
నిలుకాల నిలువక యేఁగు బెగడి
|
|
తే. |
యడిగినంతయు రో యిచ్చినట్టి కొత్త
కోడెఁ జేకొని తను వెళ్లఁగొట్టుటయును
[10]బ్రాతిఁ తను నన్పులంజను బాయ లేక
వ్రీడ యించుక లేని చేబోఁడిఁ జూచు.
| 115
|
వేశ్యలక్షణము
[11]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-121]
సీ. |
ధన మాస వేఱొండు దలఁపదయే నది
జలజలోచనకు నౌషధపుఁ గూర్మి
ఘను నొద్దనుండియెఁ దన కాసబడియె నేఁ
|
|
- ↑ సుంకసాల
- ↑ క.లో లేదు.
- ↑ గ.మోనల గందరిలంబు
- ↑ క.లో లేదు.
- ↑ గ.దొల్చిన
- ↑ గ.తంటుకొని
- ↑ గ.నొదిర్చి
- ↑ క.లో లేదు.
- ↑ గ.నిట్లు
- ↑ గ.చాంతి
- ↑ సుంకసాల