పుట:ప్రబంధరత్నాకరము.pdf/178

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

మదనరతికోవిదులు పీఠమర్దకాది
విటులు సల్లాపములు సేసి వేడ్క సేయ
మోహనాకారుఁడై మరుమూర్తి వోలెఁ
బల్లవుడు కేళిమందిరాభ్యంతరమున.

109

కువిటుఁడు

పెదపాటి యెఱ్ఱాప్రెగడ – కుమారనైషధము

సీ.

అడియాస రే కొల్పి యరవీసమును నీక
              యాడుచుండును చేతి కందినట్ల
[1]మొనసి [2]బంధుల ప్రోకలను వెంటఁబెట్టుక
              [3]క్రుమ్మరించును దన యెమ్మె లెల్ల
గప్పు వెట్టిన పండ్లు గానరాఁ బలుకుచు
              [4]నెరవు సొమ్ములు చూపి [5]మురియు నురక
యెన్ని లే వకట తా [6]నీడేర్చినవి యిండ్లు
              మాటికిఁ జెప్పుకో నేటి కనుచు


తే.

రాగిపైఁ బూఁత పూసిన రవణములును
నెఱయ [7]బచ్చలి పండుల కఱులు చెమరి
నట్టి ప్రాఁతల చుట్టలు పెట్టి పెట్టి
తగిలి వలదన్న మానక దాఁచఁబెట్టుఁ
జెప్ప రోఁతలువో వీని చేఁతలెల్ల.

110

కళావిలాసము

[8]ఆ.

[9]పాఱుతెంచు మ్రాఁకు నేఱు నూఁతులు దాఁటి
బండి యెత్తు నాఁడుఁ బాట వాఁడు
రిత్తనగవు నవ్వు మత్తిల్లి కువిటుండు
సుదతు లెదుర నున్నఁ జూచెనేని.

111


[10]క.

వన్నెలు మీఁదుగఁ గట్టును
కన్నులు వెసఁ ద్రిప్పుఁ జేతఁ గంభము వ్రేయన్
దన్నెఱుఁగఁడు వనితలఁ బొడ
గన్నను గువిటుఁడు కుప్పిగంతులు వైచున్.

112
  1. గ.మొనళి
  2. క.బంద్దుల, చ.పద్దుల
  3. క.చ.ముమ్మరించు
  4. చ.ఎఱువు
  5. చ.ముఱియు
  6. గ.నిద్రజేసిన
  7. క.బచ్చలిపండ్లకర్రలు చమరి, చ.అచ్చరిపండ్ల కఱ్ఱలును జమిరి
  8. క.లో లేదు.
  9. గ.పారు
  10. క.లో లేదు.